రైతులను ఆదుకోవాలి: మాజీ ఎంఎల్‌ఎ హేమలత

రైతులను ఆదుకోవాలి: మాజీ ఎంఎల్‌ఎ హేమలత

రైతులను ఆదుకోవాలి: మాజీ ఎంఎల్‌ఎ హేమలతప్రజాశక్తి -కెవిబిపురంమిచౌంగ్‌ తుపాను కారణంగా కెవిబి పురం మండలంలో ఒళ్లురు గ్రామంలో వర్షానికి గోడలు పడిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయంగా 5వేల రూపాయలను బాధిత కుటుంబాలకు అందజేశారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి అనంతరం వ్యవసాయ అధికారితో, కరెంట్‌ అధికారితో, రోడ్లుకు సంబంధించిన పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో మాట్లాడి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలన్నారు. అదేవిధంగా అంజూరు నుంచి జయలక్ష్మిపురానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలని, అంగేరిచెరువు రోడ్డు తక్షణమే స్పందించి రోడ్డు వేసి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునస్వామి యాదవ్‌, ఒళ్లురు సర్పంచ్‌ సురేష్‌, లోకి ముని కష్ణయ్య పాల్గొన్నారు

➡️