లోతట్టు ప్రాంతాల్లో భోజనం పంపిణీ

లోతట్టు ప్రాంతాల్లో భోజనం పంపిణీ

లోతట్టు ప్రాంతాల్లో భోజనం పంపిణీప్రజాశక్తి -వెంకటగిరి రూరల్‌ : లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.10 ఫీజుతోనే వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్‌ కళాధర్‌ మంగళవారం భోజనం అందించారు. కైవల్య నది ప్రాంతం ఒడ్డున్న ఉన్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి అన్నం ప్యాకెట్లను అందించారని గొల్లగుంట మురళి తెలిపారు. చేనేత మగ్గం గుంటలు పరిశీలన చేనేత కార్మికుల మగ్గం గుంతలను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నక్క భానుప్రియ వివిధ ప్రాంతాలలో బుధవారం పరిశీలించారు. నాలుగు రోజులుగా మగ్గం కార్మికులు జీవన భృతిని కోల్పో యారన్నారు. నష్టం అంచనాలను నియోజకవర్గ సమన్వయ కర్త రాంకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి తెలియజేసి నష్టపరిహారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరామయ్య, చేనేత రాష్ట్ర కమిటి సభ్యులు నక్క వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️