వరద ప్రవాహంలో చిక్కుకున్న వారినిరక్షించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది

వరద ప్రవాహంలో చిక్కుకున్న వారినిరక్షించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది

వరద ప్రవాహంలో చిక్కుకున్న వారినిరక్షించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిప్రజాశక్తి -తొట్టంబేడు: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలో చిన్నపాటి వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం పడడంతో పాటు మండలంలో ఉన్న కారాకొల్లు వాగు ఉధతి పెరగడంతో రాకపోకలు స్తంభించాయి. అయితే గ్రామానికి చెందిన చిన్న బత్తయ్య నాయుడు(53) సతీమణి నాగరత్నమ్మ(45)లు తిరువన్నామలై నుంచి తిరిగి గ్రామానికి చేరుకునే ప్రయత్నంలో భాగంగా వాగు నీటిలో ఉధతి ఎక్కువగా కావడంతో వాగులోనే చిక్కుకుపోయారు. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో పక్కనే ఉన్న ఓ విద్యుత్‌ స్తంభాన్ని పట్టుకొని సాయం కోసం నిరీక్షించారు. దీంతో స్థానికులు తహశీల్దార్‌ కు సమాచారం అందించగా ఆయన వెంటనే తొట్టంబేడు ఎస్సై రాఘవేంద్ర ,అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు .దీంతో హుటాహుటిన కారాకొల్లు వాగు వద్దకు చేరుకుని వాగులో చిక్కుకున్న వారికి లైఫ్‌ జాకెట్లు అందించి తాళ్ల సాయంతో అతి కష్టం పైన బయటకు తీసుకువచ్చారు. దీంతో తమ ప్రాణాలను కాపాడిన తొట్టంబేడు ఎస్సై రాఘవేంద్ర ,పోలీస్‌ సిబ్బందికి ఇంచార్జి అగ్నిమాపక అగ్నిమాపక అధికారి నాగార్జున రెడ్డి సిబ్బందికి వారు ధన్యవాదాలు తెలిపారు.

➡️