విద్యార్థుల్లో మనోధైర్యం నింపాలి: ఎంపీడీవో

విద్యార్థుల్లో మనోధైర్యం నింపాలి: ఎంపీడీవో

విద్యార్థుల్లో మనోధైర్యం నింపాలి: ఎంపీడీవో ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : విద్యార్థుల మనసులో మనోధైర్యాన్ని నింపాలని విజయపురం ఎంపీడీవో టి చంద్రమౌళి పేర్కొన్నారు. ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని పుత్తూరు భవిత కేంద్రంలో ఎంపీడీవో, ఎంఈఓ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయపురం మండల ఎంపీడీవో టి. చంద్రమౌళి మాట్లాడుతూ తల్లి దండ్రులను ఉద్దేశించి.మాట్లాడుతూ విద్యార్థుల పిల్లల్లో మనో ధైర్యాన్ని నింపాలని కోరారు. ప్రతి రోజూ భవిత కేంద్రానికి పిల్లలను తీసుకొచ్చి వారిలో వున్న సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. ప్రతిరోజూ పిల్లలు ఫిజియో థెరపీ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తామని తెలిపారు. అనంతరం ఎస్‌ఎస్‌ఎ ద్వారా అందించిన టాబ్లెట్‌ లను పిల్లలకు అందించారు. అనంతరం విజయపురం ఎంపీడీవో చంద్రమౌళి సహకారంతో 30 మంది పిల్లలకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ తిరుమల రాజు. బాలసుబ్రమణ్యం. మెయిన్‌ స్కూల్‌ హెచ్‌ఎం మురళీకష్ణ. సిఆర్పి సిద్దయ్య, ఐఆర్‌టి సూర్య కుమారి, పి ఆనంద్‌, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️