విద్యాలతను హతమార్చింది ప్రియుడి మొదటి ప్రియురాలే..!

విద్యాలతను హతమార్చింది ప్రియుడి మొదటి ప్రియురాలే..!

విద్యాలతను హతమార్చింది ప్రియుడి మొదటి ప్రియురాలే..!ప్రజాశక్తి-శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి రూరల్‌: శ్రీకాళహస్తి మండలం అమ్మపాళెం సమీపంలోని పంట కాలువలో మృతదేహమై తేలిన విద్యాలత అలియాస్‌ విద్యను హత్య చేసింది ఆమె ప్రియుడు శశికుమార్‌ మొదటి ప్రియురాలు సుజాత అని శ్రీకాళహస్తి డీఎస్పీ భీమారావు తెలిపారు. శ్రీకాళహస్తి రూరల్‌ పోలీస్‌ స్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హత్యకు దారితీసిన తీరును డీఎస్పీ వివరిస్తూ తిరుచానూరు సమీపంలోని కొత్తపాళెం ఎస్టీకాలనీకి చెందిన లీలావతి (50), రవికుమార్ల కుమారుడు శశికుమార్‌ అదే కాలనీకి చెందిన ఇద్దరు బిడ్డల తల్లిగా ఉంటూ భర్త, పిల్లలను వదిలేసిన సుజాత (36)ను ఎనిమిదేళ్ల్ల్లుగా తన ఇంట్లోనే ఉంచుకుని సహజీవనం సాగిస్తున్నాడు. కాగా సుజాతపై మోజు తగ్గగానే ఆరు నెలల క్రితం అదే తరహాలో భర్తతోపాటు ఇద్దరు పిల్లలను వదిలేసిన విద్యాలతను తీసుకెళ్లి తన ఇంట్లోనే ఉంచి ఇద్దరితో ఏకకాలంలో సహజీవనం సాగిస్తున్నాడు. శశికుమార్‌ తో విద్యాలత సహజీవనం చేయడం నచ్చని సుజాత తరచూ విద్యాలతతో గొడవకు దిగేది. ఇదే సమయంలో ప్రియుడు శశికుమార్‌, విద్యాలతలు కువైట్‌ వెళ్లాలని చర్చించుకుంటుండటంతో తన ప్రియుడు తనకు దూరమైపోతాడని భావించిన సుజాత ఎలాగైనా విద్యాలత అడ్డుతొలగించుకోవాలని భావించింది. విద్యాలతను మట్టుపెట్టాలని సుజాత, శశికుమార్‌ తల్లి లీలావతితో కలిసి వ్యూహరచన చేసింది. ఈనెల 16న రాత్రి శశికుమార్‌ ఇంట్లో లేని సమయంలో విద్యాలత నిద్రిస్తుండగా ముఖంపై దిండుతో అదిమి హతమార్చారు. మతదేహాన్ని ప్లాస్టిక్‌ గోనెసంచిలో మూటగట్టారు. ఓ ఆటోను బాడుగకు మాట్లాడుకున్న సుజాత, లీలావతి మూటను ఆటోలోవుంచి అక్కడ నుంచి శ్రీకాళహస్తికి బయలుదేరారు. మిట్టకండ్రిగ వద్దకు రాగానే తొండమనాడు మార్గంలో అమ్మపాళెం క్రాస్‌ వద్ద అర్ధరాత్రివేళలో మూటను దించుకుని ‘తమ మామ కారులో వస్తాడని నీవు వెళ్లిపో’ అంటూ ఆటోడ్రైవరును అక్కడి నుంచి పంపేశారు. అనంతరం సమీపంలోని పంట కాలువలో విద్యాలత మతదేహాన్ని పడేసి దానిపై కొబ్బరి మట్టలు కప్పి అక్కడి నుంచి తాపీగా నడుచు కుంటూ మిట్టకండ్రిగకు చేరుకుని బస్సులో ఇంటికి వెళ్లిపోయారు.17న ఉదయం కాలువలో మతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి రూరల్‌ సీఐ అజరు కుమార్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మతురాలి చేతిపై ఉన్న ట్యాటూకు సోషల్‌ మీడియాలో విస్తత ప్రచారం కల్పించడంతో దామినేడుకు చెందిన పుష్ప, మతురాలు తన కుమార్తె విద్యాలతదిగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు అందించారు. దర్యాప్తు ప్రారంభించిన సీఐ నిందితులు సుజాత, లీలావతిలను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ చేపట్టడంతో తక్కువ సమయంలోనే కేసును ఛేదించారు. ఈ మేరకు నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్‌ విధించినట్లు తెలిపారు.

➡️