విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో తడ విద్యార్థినులు రాష్ట్ర స్థాయికి ఎంపిక

విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో తడ విద్యార్థినులు రాష్ట్ర స్థాయికి ఎంపిక

విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో తడ విద్యార్థినులు రాష్ట్ర స్థాయికి ఎంపికప్రజాశక్తి – తడ: శ్రీ కాళహస్తి లో వున్న జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో తడ మండలం లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చిన్న మాంబట్టు విద్యార్థు లు ఎం శ్రావ్య , యన్‌ వర్షిత తయారు చేసిన సైన్స్‌ ప్రాజెక్ట్‌ రాష్ట్ర స్థాయికి ఎంపిక అయింది. ఎంపికైన విద్యార్థినిలు ఇద్దరికి తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కే .శేఖర్‌ ప్రశంసాపత్రం అందించారు. ఈ విద్యార్థినులు ఈనెల 28 ,29 దినాల్లో కడపలో జరిగే రాష్ట్రస్థాయి విద్య , వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారని పాఠశాల హెచ్‌ఎం హెచ్‌డి ఫణివేణి, సైన్స్‌ ఉపాధ్యాయులు జయరాములు, వహీద, హసీనా తెలిపారు.

➡️