విశేషంగా రథసప్తమిసంతృప్తికరంగా వాహనసేవల దర్శనం

విశేషంగా రథసప్తమిసంతృప్తికరంగా వాహనసేవల దర్శనం

విశేషంగా రథసప్తమిసంతృప్తికరంగా వాహనసేవల దర్శనంప్రజాశక్తి – తిరుమలసూర్యజయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు. టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి, జెఇఒ వీరబ్రహ్మం వాహనసేవల్లో పాల్గొని, భక్తులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు. చలికి, ఎండకు ఇబ్బందుల్లేకుండా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్లలో భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని వాహనసేవలను తిలకించారు. శ్రీవారి సేవకులు భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేశారు. ముఖ్య కూడళ్లలో శోభాయమానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టారు. 850 మంది టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, 700 మంది పోలీసుల సేవలను వినియోగించుకున్నారు. 2900 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్షప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 900 మంది కళాకారులు పాల్గొన్నారు.

➡️