వేతన సవరణ జరపాలి : ఎల్‌ఐసిఉద్యోగుల విధుల బహిష్కరణ

వేతన సవరణ జరపాలి : ఎల్‌ఐసిఉద్యోగుల విధుల బహిష్కరణప్రజాశక్తి -తిరుపతి టౌన్‌వేతన సవరణ తక్షణం జరపాలని కోరుతూ ఎల్‌ఐసి ఉద్యోగులు తిరుపతిలోని బ్రాంచ్‌ 1, బ్రాంచ్‌ 2, సేల్స్‌ ట్రైనింగ్‌ సెంటర్లలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి ఒంటి గంట 30 నిమిషాల వరకు గంట పాటు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నా నుద్దేశించి ఉద్యోగుల డివిజన్‌ నాయకుడు వై. కష్ణ కుమార్‌ మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌ లో ఉన్న వేతన సవరణ వెంటనే జరపాలని డిమాండ్‌ చేశారు. క్లాస్‌ వన్‌ అధికారుల జిల్లా నాయకులు ఇ. వెంకట ముని మాట్లాడుతూక్లాస్‌ 1 క్లాసు2, క్లాస్‌ త్రీ ఉద్యోగులు జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పడి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. డెవలప్‌ మెంట్‌ ఆఫీసర్ల నాయకులు తీర్థానంద రెడ్డి, బాలకష్ణ, రమేష్‌ ,రామ్‌, రమేష్‌ కుమార్‌, రాజశేఖర పాల్గొన్నారు.

➡️