వైసిపికి బిసిలపై చిత్తశుద్ది లేదు: గోపి

వైసిపికి బిసిలపై చిత్తశుద్ది లేదు: గోపిప్రజాశక్తి-తిరుపతి(మంగళం)వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వెనుకబడిన తరగతుల ప్రజలు అంటే చిత్తశుద్ధి లేదని తిరుపతి కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు యార్లపల్లి గోపి అన్నారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో వైసిపి అరాచక పాలన వల్ల పలు సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ప్రత్యక్ష పరోక్ష నరకాలను చూస్తున్నారన్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కనీసం కుర్చీలు కూడా ఇవ్వలేదని, ఇక నిధుల సంగతి చెప్పనక్కర్లేదన్నారు. బీసీ నాయకుడు జంగా కష్ణమూర్తి ముఖ్యమంత్రిని కలసి తన గోడు చెప్పుకోవడానికి ప్రయత్నించగా ఆరు నెలలు గడిచినా కూడా అపాయింట్మెంట్‌ ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శాంతి యాదవ్‌, రవి, శోభ, జావీద్‌ పాల్గొన్నారు.

➡️