వ్యవసాయ వర్సిటీ ఒప్పంద సేవకుల వినతి

వ్యవసాయ వర్సిటీ ఒప్పంద సేవకుల వినతి

వ్యవసాయ వర్సిటీ ఒప్పంద సేవకుల వినతిప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవలుగా పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ అగ్రికల్చర్‌ కళాశాల వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సిఐటియు ఆధ్వర్యంలో డి.ఆర్‌.ఓకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం లేబర్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌ జయ చంద్ర, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పి సాయి లక్ష్మి, అప్కాస్‌ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని గత నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. యూనివర్సిటీ యాజమాన్యం వారి జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. కాంట్రాక్టు లేబర్‌కు ఏడాదంతా పని చూపించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు వరలక్ష్మి , చంద్రమ్మ సుబ్బు ముని లక్ష్మి, రాధా ,గిరిరేవతి, నాగరాజు ,నవీన్‌, చక్రి పాల్గొన్నారు.

➡️