శేషాద్రి నగర్‌లోనూ ఓట్లున్నారు.. పాలకా.!

Dec 5,2023 21:30
శేషాద్రి నగర్‌లోనూ ఓట్లున్నారు.. పాలకా.!

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): తిరుపతి రూరల్‌ మండలం శేషాద్రి నగర్‌లో సమస్యలు కాలనీ వాసులను వెంటాడుతున్నాయి. నివాస సముదాయంలో పారిశుద్ధ్యం లోపించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. చెత్త తొలగించక.. మురుగునీరు పారక సమస్యలు పడుతున్నామని వాపోయారు. దోమలు ప్రబలి విషజ్వరాలు వస్తున్నాయని, మురునీరు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు చెబుతున్నారు. దాదాపు 2500కుటుంబాలు కాలనీలో నివసిస్తున్నారు. పారిశుద్ధ్యం నిర్వహించాలని కార్పొరేషన్‌ అధికారులను స్థానికులు సంప్రదించగా తమ పరిధి కాదని, అక్కడి పంచాయతీలో సంప్రదించాలని తెగేస ిచెబుతున్నట్లు మండిపడ్డారు. పంచాయతీ అధికారులను సంప్రదిస్తే కార్పొరేషన్‌ అధికారులను సంప్రదించాలని జారుకుంటున్నట్లు స్థానిక కాలనీ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న స్థానికుల గోడు పట్టించుకోని అధికారుల తీరు పట్ల కాలనీ ప్రజలు మండిపడుతున్నారు. తమ ఓట్లు ఎవరి పరిధిలోకి వస్తాయో వారినే నిలదీయాలంటూ వాపోయారు. ఎన్నికల సమయంలో వస్తే నేతలను నిలదీసి తీరుతాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

➡️