శ్రీరామలో మానవ హక్కులపై అవగాహన

శ్రీరామలో మానవ హక్కులపై అవగాహన

శ్రీరామలో మానవ హక్కులపై అవగాహనప్రజాశక్తి-తిరుపతి(మంగళం)అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని తిరుపతి-కరకంబాడి మార్గంలోని శ్రీరామ ఇంజనీరింగ్‌ కళాశాల జాతీయ సేవ విభాగం, బిఎస్‌ అండ్‌ హేచ్‌ డిపార్ట్మెంట్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఎస్వీయూ మానవ హక్కుల విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.రవిబాబు హాజరై మానవ హక్కుల విశిష్టతను విద్యార్థులకు వివరించారు. మనిషి స్వేచ్ఛగా బతకాల్సి ఉన్నా కొన్ని పరిస్థితుల కారణంగా ఆ స్వేచ్ఛను కోల్పోతున్నాడన్నారు. సమాజంలో కుల మతాలకతీతంగా అందరూ ఒకే రకమైన స్వేచ్ఛ హక్కులను కలిగి ఉన్నారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.జయచంద్ర మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మంచి నడవడికను అలవర్చుకొని, దేశభక్తి స్ఫూర్తితో లక్ష్యసాధన కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ మన్నెం రామిరెడ్డి, కళాశాల డైరెక్టర్స్‌ మన్నెం రామసుబ్బారెడ్డి, మన్నెం అరవింద్‌ కుమార్‌ రెడ్డి, జాతీయ సేవా విభాగం ఆఫీసర్‌ ఎస్‌. చక్రిశ్రీధర్‌ పాల్గొన్నారు.

➡️