శ్రీవారి సేవలో పార్లమెంట్‌ ఎస్టిమేట్‌ కమిటీ

శ్రీవారి సేవలో పార్లమెంట్‌ ఎస్టిమేట్‌ కమిటీప్రజాశక్తి -తిరుమల: శ్రీవారిని పార్లమెంట్‌ ఎస్టిమేట్‌ కమిటీ సభ్యులు దర్శించు కున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో కమిటీ చైర్మన్‌ సంజరు జైస్వాల్‌ 20 మంది కమిటీ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించు కున్నారు. దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో కమిటీ సభ్యులకు వేద పండితులు వేదాశీర్వ చనం అందించారు. అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కమిటీ చైర్మన్‌ సంజరు జైస్వాల్‌ మాట్లాడుతూ కమిటీ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించు కోవడం చాలా సంతో షంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రసాద యోజన అమలు ఎలా జరుతుందో పరిశీలించడానికి తిరుమలకు వచ్చానని తెలి పారు. తిరుపతిలో ఉన్న ఇండియన్‌ క్యూలినరీ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించ నునట్లు తెలిపారు. ఈ ఇనిస్టిట్యూట్‌ మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో లభ్యం అయ్యే ఆహారాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నా మన్నారు.

➡️