శ్రీవారి హుండీ ఆదాయం రూ.112కోట్

శ్రీవారి హుండీ ఆదాయం రూ.112కోట్

శ్రీవారి హుండీ ఆదాయం రూ.112కోట్లుప్రజాశక్తి- తిరుమల: తిరుమలలో శనివారం నిర్వహించిన టిటిడి డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, విక్రయించిన శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, కల్యాణకట్ట, హుండీ ఆదాయం తదితర వివరాలను తెలిపారు. ఫిబ్రవరి నెలలో 10.06 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 95.43లక్షల లడ్డూలను విక్రయించినట్లు తెలిపారు. అలాగే 43.61లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని, 6.56 లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్లు వివరించారు. కాగా ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.111.71కోట్లు వచ్చినట్లు తెలిపారు.

➡️