సమయపాలన పాటించని వారిపై చర్యలు : వీసీ

సమయపాలన పాటించని వారిపై చర్యలు : వీసీ

సమయపాలన పాటించని వారిపై చర్యలు : వీసీప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగంతో ఉపకులపతి ఆచార్య శ్రీకాంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సంబంధిత విభాగ అధికారులకు సమయపాలన పాటించాలని దిశానిర్దేశం చేశారు. పరీక్షల విభాగంపై వస్తున్న విమర్శలపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల మూల్యాంకనం, ఫలితాల విడుదల జాప్యానికి కారణాలను తెలుసుకుని, పరీక్ష జరిగిన రెండు నెలల్లో ఫలితాలు, మార్కుల జాబితాలతో సహా విద్యార్థులకు అందాలని ఆదేశించారు. సర్టిఫికేట్‌ ఇవ్వడంలో కావాలని జాప్యం చేసినట్లుగా తన దష్టికి వస్తే చర్యలు తప్పవన్నారు. ఈ సమీక్షాసమావేశంలో పరీక్షల డీన్‌ ఆచార్య కిశోర్‌ , పరీక్షల నియంత్రణాధికారి దామ్లానాయక్‌ పాల్గొన్నారు.

➡️