సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ…పోరాటం ఆపే ప్రసక్తే లేదు..13వ రోజుకు అంగన్వాడీల సమ్మె

సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ...పోరాటం ఆపే ప్రసక్తే లేదు..13వ రోజుకు అంగన్వాడీల సమ్మె

సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ…పోరాటం ఆపే ప్రసక్తే లేదు..13వ రోజుకు అంగన్వాడీల సమ్మెప్రజాశక్తి- శ్రీకాళహస్తి తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం స్థానిక శ్రీకాళహస్తి ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సిఐటియు, ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ అనుబంధ సంఘాల అంగన్వాడీ నాయకులు చేస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం 13వ రోజుకు చేరుకుంది. సీఐటీయూ జిల్లా కోశాధికారి, అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలు రాజేశ్వరి సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. రెండు వారాలనుంచి అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందిన లేకపోవడం బాధాకరమన్నారు. రూ.26వేల వేతనం, గ్రాట్యుటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకుంటే సమ్మె విరమణ జరగదన్నారు. కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు తమకు మద్దతుగా నిలిచాయనీ, ప్రజా ఉద్యమంగా మారకముందే ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీ సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ నాయకులు అంగేరి పుల్లయ్య, పెనగడం గురవయ్య, గంధం మణి, రేవతి, పుష్ప, సౌజన్య, రాజా, ఐఎఫ్టీయూ నాయకులు భారతి, సక్కుభాయమ్మ, స్వర్ణ పాల్గొన్నారు.రేణిగుంట: పట్టణంలోని మంచినీళ్లుగుంట పాత తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారానికి 13వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలత సమ్మె శిబిరం వద్దకు విచ్చేసి రిలే నిరాహార దీక్షల చేస్తున్న విజయలక్ష్మి, ధనమ్మ, హైమావతి, కవిత, లక్ష్మీ, గీత, చంద్రమ్మ, లక్ష్మి, మునెమ్మ, మునిలక్ష్మీ పూలమాలవేసి అభినందనలు తెలిపారు. సిఐటియు ఏర్పేడు మండల కార్యదర్శి కరీముల్లా, సిపిఎం సీనియర్‌ నాయకులు వెంకటరమణ, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి సెల్వరాజ్‌, ఈశ్వరమ్మ పాల్గొన్నారు. బాలాయపల్లిలో అంగన్వాడీల సమ్మెను 13వ రోజూ కొనసాగించారు.గూడూరుటౌన్‌: అంగన్వాడీ సమస్యలు రాష్ట్రప్రభుత్వం పరిష్కరించుకుండా కాలయాపన చేస్తే సమ్మెను ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఆదివారం గూడూరులో అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకుంది. రైతు సంఘం నాయకులు జోగి శివకుమార్‌, అంగన్వాడీల అధ్యక్షురాలు ఏ.ఇంద్రావతి, టి.వెంకట రామిరెడ్డి, సిఐటియు పట్టణ అధ్యక్షులు బివి.రమణయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్‌.సురేష్‌, బి.చంద్రయ్య, ప్రసాద్‌ పాల్గొన్నారు.పుత్తూరుటౌన్‌: మండల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆదివారం 13 రోజు అంగన్వాడీల నిరవధిక సమ్మె కొనసాగింది. ఇందులో భాగంగా రిలే నిరాహార దీక్ష శిబిరానికి సిఐటియు. జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌, జనసేన పార్టీ నాయకుడు పి.గోపి రాయల్‌, జి.కష్ణయ్య మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. మునికుమారి, విజరు కుమార్‌, ధనమ్మ, రాధ, లలిత, అన్నపూర్ణ, లక్ష్మి పాల్గొన్నారు. నారాయణవనం: మండల కేంద్రం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ చేపట్టిన నిరవధిక సమ్మె 13వ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఆమ్‌ ఆద్మీ పార్టీ సత్యవేడు నియోజకవర్గం కన్వీనర్‌ ఎం.నందిని మద్దతు పలికారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌ నీరుగట్టు నగేష్‌ విచ్చేసి మద్దతు ప్రసంగించారు. జిల్లా కమిటీ సభ్యులు టి.జయకుమార్‌, గిరీష్‌, సూర్య, అజిత్‌, వెంకట్‌ పాల్గొన్నారు తిరుపతి టౌన్‌: అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం సాయంత్రం సుందరయ్య నగర్‌లో లబ్ధిదారులతో కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. ఆదివారం అంగన్వాడీల సమ్మె 13వ రోజు కొనసాగింది. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.వాణిశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సమ్మె చేస్తున్నప్పటికీ పిల్లలు గర్భిణీ మహిళలు అందరూ తమకు మద్దతు ప్రకటించారని తెలిపారు. సిఐటియు నాయకులు బుజ్జమ్మ, టి.సుబ్రమణ్యం, జి.బాలాజీ, నగర ప్రధానకార్యదర్శి కే.వేణుగోపాల్‌,తంజావూరు మురళి, జి.వాసు, సుశీల రాణి పాల్గొన్నారు. ఆదివారం చంద్రగిరిలో పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు పెంచాలని, గాడ్యూటీ అమలు చేయాలని కోరుతూ జగనన్న జీతం పెంచకపోతే ఆత్మహత్యలు శరణ్యం అంటూ మెడకు ఉరి తాళ్ళు వేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేశారు. 13 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ అంగన్వాడీ టీచర్లను మోసం చేస్తుందన్నారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌.జయచంద్ర, యూనియన్‌ జిల్లా కార్యదర్శి వాణిశ్రీ, ప్రియా, నాగరాజమ్మ, పద్మ, సుజాత, లీల, నాగభూషణమ్మ, విజయ కుమారి పాల్గొన్నారు.పిచ్చాటూరు: స్థానిక శిశుసంక్షేమ ప్రాజెక్టు కార్యాలయం వద్ద 13వ రోజు సమ్మెలో భాగంగా ఆదివారం అంగన్వాడీలు ఒంటి కాలుపై నిలబడి నిరసన తెలిపారు. రిలే దీక్ష చేస్తున్న అంగన్వాడీలకు టిడిపి మాజీ ఎంపీపీ దంపతులు మధుబాల పద్మనాభ రాజులతోపాటు ఆ పార్టీ నాయకులు సమ్మెకు సంఘీభావం తెలిపారు. టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు డి. పద్మనాభం రాజు రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. అలాగే సమ్మెలో పాల్గొంటున్న 398 మంది కార్యకర్తలు ఆయాలకు ఒక రోజు భోజన ఏర్పాట్లు కల్పిస్తామని ప్రకటించారు. వెంకటగిరి: స్థానిక ఐసిడిఎస్‌ ఆఫీసు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన ఆదివారం సమ్మె, రిలే నిరాహార దీక్షలు 13వ రోజు కొనసాగించారు. యూనియన్‌ ప్రాజెక్ట్‌ కార్యదర్శి ఎన్‌.స్వరూప రాణి, మండల అధ్యక్షురాలు సుభాషిని యాదవ్‌ పాల్గొన్నారు.

➡️