సమ్మె శిబిరంలోనే ‘క్రిస్మస్‌’ ప్రార్థనలుతిరుపతిలో సహపంక్తి భోజనాలు శిబిరాల్లో ప్రార్థనలు పుత్తూరులో ‘షూ’ పాలిష్‌ చేస్తూ..వినూత్న తరహాలో అంగన్‌వాడీల సమ్మె

సమ్మె శిబిరంలోనే 'క్రిస్మస్‌' ప్రార్థనలుతిరుపతిలో సహపంక్తి భోజనాలు శిబిరాల్లో ప్రార్థనలు పుత్తూరులో 'షూ' పాలిష్‌ చేస్తూ..వినూత్న తరహాలో అంగన్‌వాడీల సమ్మె

సమ్మె శిబిరంలోనే ‘క్రిస్మస్‌’ ప్రార్థనలుతిరుపతిలో సహపంక్తి భోజనాలు శిబిరాల్లో ప్రార్థనలు పుత్తూరులో ‘షూ’ పాలిష్‌ చేస్తూ..వినూత్న తరహాలో అంగన్‌వాడీల సమ్మెప్రజాశక్తి – యంత్రాంగం క్రిస్మస్‌ పండుగ క్రిష్టియన్లకు వచ్చే ఏకైక పెద్ద పండుగ.. అలాంటి రోజున సైతం అంగన్‌వాడీ అక్కాచెల్లెళ్లు సమ్మె నేపథ్యంలో 14వ రోజు సోమవారం శిబిరంలోనే ‘క్రిస్మస్‌’ వేడుకలను జరుపుకున్నారు. గూడూరులో శిబిరంలో అంగన్‌వాడీలు అందరూ కలిసి ‘ప్రార్థన’లు చేశారు. అనంతరం ఒంటికాలిపై నిరసన తెలియజేశారు. రెండు వారాలుగా తమ కుటుంబాల బాధ్యతలను పక్కన పెట్టి పస్తులతో దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. సమ్మె ప్రజా ఉద్యమంగా మారకముందే ప్రభుత్వం అంగన్‌వాడీ సంఘాలతో చర్చలు జరిపి న్యాయపరమైన సమస్యలు తీర్చాలని డిమాండ్‌ చేశారు. ఎపిటిఎఫ్‌ స్టేట్‌కౌన్సిలర్‌ వై.సుబ్రమణ్యంరాజు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్‌.సురేష్‌, బివి రమణయ్య, అంగన్‌వాడీ అధ్యక్షురాలు ఎ.ఇంద్రావతి, సెక్టార్‌ లీడర్లు లక్ష్మీ, ముని, పెంచలమ్మ, మంగమ్మ, హైమావతి పాల్గొన్నారు. – తిరుపతి టౌన్‌లో …క్రిస్మస్‌ పండుగ ప్రభుత్వ సెలవు. సంతోషంగా కుటుంబంతో చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేసుకుని ఆనందంగా గడిపే రోజు. అయినా అంగన్‌వాడీలు రోడ్లపైనే సమ్మె శిబిరంలోనే పండుగ జరుపుకున్నారు. అక్కచెల్లెమ్మలతో అందరితో కలిసి ‘హిందూ ముస్లీం క్రైస్తవులు అందరూ భాయిభాయి.. మేమంతా మనుష్యులం.. కార్మికులం.. కార్మిక ఐక్యత వర్థిల్లాలి’ అంటూ సహపంక్తి భోజనాలు చేశారు. ‘ప్రభూ.. ముఖ్యమంత్రి మనస్సు మార్చి అంగన్‌వాడీల జీతాలు పెంచేలా చూడు’ అని నినాదాలు చేశారు. చిలిచి చిలికి గాలివాన అయ్యేలా చేసుకోకుండా సత్వరం సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కే వేణుగోపాల్‌, పి బుజ్జి అంగన్వాడి నగర కార్యదర్శి టి నాగరాజమ్మ, సుజిత, గోమాతమ్మ, ఎల్లమ్మ, గీత, రాజరాజేశ్వరి, అరుణ, గంగాదేవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.- పిచ్చాటూరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టులో ‘ప్రభూ.. జగన్‌కు మంచి బుద్ధి కలిగించి.. అంగన్‌వాడీలకు న్యాయం చేయాలి’ అని రాసి ఉన్న కేక్‌ను క్రిస్‌మస్‌ సందర్భంగా కట్‌చేసి పండుగ జరుపుకున్నారు.రైతుసంఘం జిల్లా అధ్యక్షులు దాసరి జనార్ధన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏసుక్రీస్తుకు భక్తునిగా ఉన్నందున అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించేలా చూడాలని విజ్ఞప్తిచేశారు. యూనియన్‌ నాయకులు ఇంద్రాణి, రాజేశ్వరి మాట్లాడుతూ ఏసుప్రభువు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మనస్సులో దూరి తమ సమస్యలు పరిష్కరించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, శ్రీవాణి, భారతి, శ్రీదేవి, కల్యాణి, గ్లోరీ పాల్గొన్నారు.- పుత్తూరు టౌన్‌లో… అంబేద్కర్‌ సర్కిల్‌ ఎదురుగా ‘షూ’ పాలిష్‌చేస్తూ నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్‌, యూనియన్‌ నాయకులు మునికుమారి, విజరుకుమారి, ధనమ్మ, హైమావతి, మోహన్‌ లక్ష్మీ, లలిత, అన్నపూర్ణ పాల్గొన్నారు. – కోటలో ఒంటికాలుపై నిల్చుని నిరసన తెలిపారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల అంగన్‌వాడీ ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. మండల అధ్యక్షురాలు పద్మలీలమ్మ, సరోజినీ ఉన్నారు.- రేణిగుంటలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాక్రిష్ణ, రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.హేమలత, సిఐటియు మండల కార్యదర్శి హరినాథ్‌, సిపిఎం నాయకులు ఒ.వెంకటరమణ, శివానందం, సత్యశ్రీ, ఈశ్వరమ్మలు సంఘీభావం తెలిపారు. వామపక్ష పార్టీలన్నీ 26న సమ్మెలో ప్రత్యక్షంగా మద్దతు ప్రకటిస్తాయన్నారు. – శ్రీకాళహస్తి ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సిఐటియు, ఐఎఫ్‌టియు, ఎఐటియుసి అనుబంధ సంఘాల అంగన్‌వాడీ నాయకులు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరుకుంది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య సంఘీభావం ప్రకటించారు.- నాయుడుపేటలో అంగన్‌వాడీలు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గడియారం సెంటర్‌నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ జరిగింది. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంగన్‌వాడీలు 14 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివకవి ముకుంద, అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ, ఐద్వా నాయకులు చంద్రకళ, మేరి, రత్నమ్మ పాల్గొన్నారు.

➡️