సిఎం, తహశీల్దార్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టాలిఎస్‌పికి ఎర్రగుట్ట గుడిసెవాసుల ఫిర్యాదు

సిఎం, తహశీల్దార్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టాలిఎస్‌పికి ఎర్రగుట్ట గుడిసెవాసుల ఫిర్యాదుప్రజాశక్తి – తిరుపతి సిటిఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పి స్థలం చూపకుండా నమ్మించి మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై, రేణిగుంట తహశీల్దార్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఎర్రగుట్ట గుడిసెవాసులు 1200 మంది డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇస్తున్న సందర్భంగా తిరుపతి జిల్లావాసులకు దాదాపు మూడువేల మంది నిరుపేదలకు జగనన్న పట్టాలు ఇచ్చి మూడేళ్లయ్యిందన్నారు. ఇంతవరకూ స్థలం చూపించకుండా ప్రజలను మోసం చేశారని అడిషనల్‌ ఎస్‌పికి ఫిర్యాదు చేశారు. పేదవాడు ఏదైనా చిన్న తప్పు చేస్తే వెంటనే కేసు నమోదు చేస్తారని, మరి ముఖ్యమంత్రి, తహశీల్దారు రాష్ట్రంలో పేద ప్రజలను మోసం చేస్తే కేసులు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కుమారి, అరుణ్‌, జ్యోతీష్‌, అమీర్జాన్‌, శివ, ప్రశాంత్‌, చంద్రమౌళి, సత్యశ్రీ, దీప, సంధ్య, నాగరాజు, మస్తాన్‌, ప్రకాష్‌, సుభాష్‌, నాగేంద్ర, రాధిక, సుజాత, మమత, పార్వత్రి, పవిత్ర, సుధ, గాయత్రి, శ్రీను, కమల్‌ పాల్గొన్నారు.

➡️