స్మగ్లర్ల ఘాతుకం..?బారికేడ్లను ఢకొీన్న వాహనంపిసి ప్రభాకర్‌రావు కోమాలోకి

స్మగ్లర్ల ఘాతుకం..?బారికేడ్లను ఢకొీన్న వాహనంపిసి ప్రభాకర్‌రావు కోమాలోకి

స్మగ్లర్ల ఘాతుకం..?బారికేడ్లను ఢకొీన్న వాహనంపిసి ప్రభాకర్‌రావు కోమాలోకి..ప్రజాశక్తి-తిరుపతి బ్యూరోఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్‌ నుంచి తప్పించుకునేందుకు ఘాతుకానికి తెగబడ్డారు. వెంకటగిరి ఏర్పేడు మార్గంలోని చింతలపాలెం చెక్‌ పోస్ట్‌ మార్గంలో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో తిరుపతి టాస్క్‌ ఫోర్స్‌ కేంద్ర కార్యాలయం నుండి వాహనాలు తనిఖీ చేపట్టడానికి టాస్క్‌ ఫోర్స్‌ బందం బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున టాస్క్‌ ఫోర్స్‌ బందంలోని ఏఆర్‌ పిసి(పిసి నంబర్‌ 3057) ప్రభాకర్‌ రావు వేగంగా వస్తున్న స్మగ్లర్ల వాహనాన్ని అడ్డుకోవడానికి రోడ్డుకు అడ్డంగా బారికెడ్లను ఉంచారు. గమనించిన స్మగ్లర్ల వాహనం వేగంగా బారికేడ్‌లను ఢకొీనింది. ఈ ఘటనలో బారికేడుకున్న ఇనుప కడ్డీ పిసి ప్రభాకర్‌ రావు తలకు బలంగా తగలడంతో అతను కోమాలోకి వెళ్లిపోయాడు. ఈ హఠాత్‌ పరిణామంతో తేరుకున్న సిబ్బంది వెంటనే ప్రభాకర్‌ రావును దగ్గరలోని అమర హాస్పిటల్లో అడ్మిట్‌ చేశారు. ప్రభాకర్‌ రావు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో వెంటనే వైద్యులు సర్జరీ చేయాలని సూచించారు. ప్రస్తుతం వైద్యులు ప్రభాకర్‌ రావుకు సర్జరీ చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన ప్రభాకర్‌ రావు కడప ఏఆర్‌ కు ఎంపికయ్యారు. అక్కడి నుండి తిరుపతి రెడ్‌ శాండిల్‌ టాస్క్‌ ఫోర్స్‌ కు బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. ప్రభాకర్‌ రావు ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో తోటి సిబ్బంది చందాలు వేసి మరొక ఆపరేషన్‌ చేయించడానికి ఇతర సిబ్బందిని సహాయం కోరినట్టుగా సమాచారం.టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌ఎస్‌ఐ వినోద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏర్పేడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

➡️