హోలీ వేడుకల్లో జిల్లా ఎస్‌పి

హోలీ వేడుకల్లో జిల్లా ఎస్‌పి

హోలీ వేడుకల్లో జిల్లా ఎస్‌పి ప్రజాశక్తి – తిరుపతి సిటి విధుల నిమిత్తం తిరుపతి జిల్లాకు వచ్చిన బిఎస్‌ఎఫ్‌ బలగాలను కుటుంబ సభ్యులుగా భావించి, అన్నీ తానై, వారితో మమేకమై స్థానిక బిఎస్‌ఎఫ్‌ క్యాంపులో జిల్లా ఎస్పీ కష్ణ కాంత్‌ పటేల్‌ సోమవారం ఘనంగా హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధుల నిమిత్తం మన జిల్లాలో ఉంటున్న బిఎస్‌ఎఫ్‌ బలగాలలో, ఆత్మస్థైర్యాన్ని నింపాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు వారితో కలిసి హోలీ పండుగను కోలాహలంగా జరుపుకున్నామన్నారు.బిఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ మురళి, అసిస్టెంట్‌ కమాండెంట్లు సంజీవ్‌, గౌరీ శంకర్‌, డీఎస్పీలు భాస్కర్‌ రెడ్డి, సురేంద్ర రెడ్డి, రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.

➡️