108 వాహనంలో ప్రసవం- తల్లీబిడ్డ క్షేమం

108 వాహనంలో ప్రసవం- తల్లీబిడ్డ క్షేమం

108 వాహనంలో ప్రసవం- తల్లీబిడ్డ క్షేమంప్రజాశక్తి- బుచ్చి నాయుడుకండ్రిగ: మండలంలోని వేణుగోపాలపురం పంచాయతీ చెందిన ఆనంద్‌ భార్య పుష్ప పురిటి నొప్పులు రావడంతో బంధువులు 108కి సమాచారం అందించారు. అంబులెన్సులో శ్రీ కాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వెళుతుండగా మార్గ మధ్యంలో 108 వాహనంలోనే పుష్ప పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తొట్టంబేడు వద్ద ఇఎంటి సుధాకర్‌, పిఐకెవొటి దిలీప్‌ వైద్య సాయంతో డెలివరీ చేశారు. 108 లోనే సురక్షితంగా డెలివరీ చేసిన సిబ్బందికి మండల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

➡️