14,15 తేదీల్లో ఆశాల ధర్నాశ్రీ 36 గంటల వంటావార్పు శ్రీ జిల్లా వైద్యాధికారికి వినతిపత్రం సమర్పణ

14,15 తేదీల్లో ఆశాల ధర్నాశ్రీ 36 గంటల వంటావార్పు శ్రీ జిల్లా వైద్యాధికారికి వినతిపత్రం సమర్పణ

14,15 తేదీల్లో ఆశాల ధర్నాశ్రీ 36 గంటల వంటావార్పు శ్రీ జిల్లా వైద్యాధికారికి వినతిపత్రం సమర్పణప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ ఆశా కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సోమవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శ్రీహరికి ఆశాలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ సంస్థ అయిన ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, లక్ష్మి, కష్ణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమస్యల పరిస్కారం కోసం ఈనెల 14, 15 తేదీలలో జిల్లావైద్యాధికారి కార్యాలయం ఎదుట 36 గంటల వంటా, వార్పు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆశాలకు కనీస వేతనాలు చెల్లించాలని, పనిభారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్‌, గ్రూప్‌ న్యూరెన్స్‌ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఆశా నియామకాల్లో రాజకీయ జోక్యం తొలగించాలని, ప్రభుత్వమే నియామకాలు చేపట్టాలని కోరారు. అలాగే రిటైర్మెంట్‌ కాలాన్ని 62ఏళ్ళకు పెంచాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించిన తరువాతే రిటైర్మెంట్‌ చెయ్యాలని యూనియన్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. గత 18 సంవత్సరాలుగా పేదప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారని, ప్రభుత్వం వీరిసేవలను గుర్తించి కార్మికులుగా గుర్తించాలని, ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరారు. 60 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు పనిచేయించుకొని ఆశా వర్కర్‌కు ప్రభుత్వం రిటైన్మెంట్‌ బెనిఫిట్స్‌ సౌకర్యం కల్పించకుండానే తొలగించటం సరైన పద్ధతి కాదన్నారు. విధి నిర్వహణలో ప్రమాదవ శాత్తు, అనారోగ్యంతో చాలామంది ఆశా వర్కర్లు చనిపోతున్నారని, వారికి ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలన్నారు. ఈ వినతి పత్రం సమర్పించిన వారిలో సిఐటియు నేతలు జిబిఎస్‌ మన్యం, ఆశా కార్మికులు పాల్గొన్నారు.

➡️