25వ రోజుకు న్యాయవాదుల దీక్ష

25వ రోజుకు న్యాయవాదుల దీక్ష

25వ రోజుకు న్యాయవాదుల దీక్షప్రజాశక్తి -తిరుపతి సిటీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం 25వ రోజుకు చేరుకుంది. జిల్లా కోర్టు సముదాయాలు వద్ద నిర్వహిస్తున్న న్యాయవాదుల నిరాహార దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి న్యాయవాదులు ఎన్‌ఎం మణి, దివాకర్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ భూ హక్కు చట్టం 2022 ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతుందన్నారు. ప్రజలు తమ ఆస్తులు సైతం రెవెన్యూ అధికారుల దయాదాక్షిణ్యాలతో అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడడం సరైనది కాదన్నారు. ఈ భూచట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉషారాణి, నాగభూషణం, మమత, నాగరాజు, బాలకష్ణ, న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️