కోటలో అంగన్వాడీల భారీ ర్యాలీ

Dec 27,2023 16:58 #Tirupati district
anganwadi strike 16th day tpt kota

ప్రజాశక్తి-కోట : కోట మండలంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల అంగన్వాడిలు స్థానిక ఐసిడిఎస్ అంగన్వాడి ప్రాజెక్టు కార్యాలయం నుండి కోట గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం అంగన్వాడిలు 16వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఆట అవకాడో చెట్టమ్మ మండలాల్లోని అంగన్వాడీ ఉద్యోగులు భారీ సంఖ్యలో ర్యాలీని చేపట్టి కోట గాంధీ బొమ్మ వద్ద మానవహారం చేపట్టారు. అంతేకాకుండా అంగన్వాడిలకు యుటిఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు పద్మ లీలమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే తమ కోరికలు నెరవేర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగస్తులు పద్మలీలమ్మ, సరోజిని, రాధా, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల అంగన్వాడీ ఉద్యోగస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

➡️