భోగిమంటలో ఏస్మా జీవో, సోకాసు నోటీసులు దగ్ధం 

Jan 12,2024 16:58 #Tirupati
anganwadi workers strike 32nd day in tpt

ప్రజాశక్తి- పుత్తూరు టౌన్(తిరుపతి) : పట్టణంలోని తాసిల్దార్ ఆఫీస్ ఎదురుగా 32వ రోజు అంగన్వాడి వర్కర్స్ సమ్మె సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి ఎస్మా జీవోను, సోకాస్ నోటీసులను దగ్ధం చేయడం జరిగినది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను అణిచివేయడానికి శోకాసు నోటీసులు జీవను తీసుకొచ్చి నిర్బంధించడం సరైన పద్ధతి కాదన్నారు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చిన్నపిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు శిశు సంక్షేమ శాఖ ద్వారా ఆమె ఎంతో సమకూర్చి సేవలు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్ములను గుర్తించకుండా వీధిపాలు చేయడం దారుణమన్నారు. అనంతరం భోగి చుట్టూ అంగన్వాడి వర్కర్స్ గొబ్బిలి తట్టి నిరసన వ్యక్తం చేశారు. ముగ్గులు వేయడం జరిగినది ఈరోజు జరుగుతున్న చర్చల్లో అంగన్వాడి వర్కర్లకు సానుకూల చర్చలు జరిపి వేతనాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సంఘ జిల్లా కార్యదర్శి వై నందయ్య, యూనియన్ నాయకులు ముని కుమారి, విజయ్ కుమారి, ధనమ్మ, రాధా, పద్మజ, లలిత, అన్నపూర్ణ, మోహన్ లక్ష్మి, హైమావతి , గంగులమ్మ, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

➡️