ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఆర్‌ సెట్‌ పరీక్షలు

ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఆర్‌ సెట్‌ పరీక్షలుప్రజాశక్తి – క్యాంపస్‌ : రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలో ప్రవేశానికి చేపట్టిన ఏపీ ఆర్‌ సెట్‌ 2023 -24 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగాయి. హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని 17 కేంద్రాల్లో ఈ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. 10,050 మంది దరఖాస్తు చేశారు. 8651 మంది పరీక్షలకు హాజరు అయ్యారు. 86.5 శాతం మంది విద్యార్థులు హాజరు అయినట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ దేవప్రసాదరాజు చెప్పారు. ఏపీ రీసెట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహణకు కషి చేసిన అధికారులు సిబ్బందికి ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ ఆర్‌ సెట్‌ ఫలితాలు ఈనెల 15వ తేదీ విడుదల చేస్తామని ఆయన తెలిపారు. జూన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తామని వెల్లడించారు.

➡️