పండుగను తలపించిన పింఛన్‌ పంపిణీ

పండుగను తలపించిన పింఛన్‌ పంపిణీ

పండుగను తలపించిన పింఛన్‌ పంపిణీ ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛను లబ్దిదారులకు రూ.4వేలు పంపిణీ చేసిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గత మూడు నెలల పెండింగ్‌తో కలిపి రూ.7వేలను లబ్దిదారులకు అందించి ఎన్డీఏ ప్రభుత్వం పేదల పక్షపాతి అని నిరూపించుకుందని ఆయన చెప్పారు. నగరంలోని 35వ డివిజన్‌లో సోమవారం ఉదయం 6 గంటలకే పింఛను రూ.7వేలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందించారు. ఎమ్మెల్యేతో పాటు మేయర్‌ డాక్టర్‌ శిరీషా, కమిషనర్‌ అదితి సింగ్‌, డిప్యూటీ మేయర్‌ ముద్రా నారాయణ పాల్గొన్నారు. అలాగే 5, 6, 7, 8, 9, 42, 43, 44, 47, 48, 49, 30, 23, 24, 39 డివిజన్లలో పింఛన్లు పంపిణీ చేశారు. 19,343 మంది లబ్దిదారులకు రూ.10,30,16,500లు నగదు పింఛనుదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్పొరేటర్లు ఆర్‌సి.మునికష్ణ, నారాయణ, రేవతి, కల్పనా యాదవ్‌, ఉప కమిషనర్‌ అమరయ్య, రెవెన్యూ ఆఫీసర్‌ సేతు మాధవ్‌, డీఈ విజయకుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పంపిణీ కార్యక్రమం సోమవారం పండుగను తలపించింది. సచివాలయ సిబ్బంది నేరుగా పింఛన్‌ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెరిగిన పింఛన్‌ మొత్తాన్ని అందజేయడం జరిగింది. తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్‌ దావులూరి రామానాయుడు, టిడిపి రాష్ట్ర నాయకులు దావులూరు ప్రభాకర్‌ నాయుడు, జగన్నాథం నాయుడు, రాజేంద్ర, అర్థ మాల ధనంజయలు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చిన్న సింగమాల గ్రామంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డి సతీమణి రిషితా రెడ్డి, ఆయన తల్లి బందమ్మ పింఛన్‌ పంపిణీ చేశారు. పట్టణంలోని1, 6, 17, 19, 25 వార్డుల్లో కూడా పింఛన్‌ పంపిణీ చేశారు. గూడూరు టౌన్‌ : పెన్షన్‌ పెంచిన ఘనత చంద్రబాబుదే అని ఎమ్మెల్యే పాశిం సునీల్‌ కుమార్‌ అన్నారు. పట్టణంలోని 6వ వార్డులో పింఛనుదారులకు ఎమ్మెల్యే పింఛన్లు అందజేశారు. అనంతరం సిఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే గూడూరు పురపాలక పరిధిలోని చెన్నూరులో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. టిడిపి నాయకులు మట్టం శ్రావణి రెడ్డి, అల్లూరు కరుణాకర్‌ రెడ్డి, ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి, శ్రీకిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి , మట్టం మురళి పేర్కొన్నారు. రామచంద్రపురం: సోమవారం ఉదయం తిరుపతి రూరల్‌ మండలం ఓటేరు గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రత పింఛన్లను ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు. అలాగే మండలంలోని రాయలచెరువు, కుప్పం బాదూరు గ్రామాలలో ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి పింఛన్లను పంపిణీ చేశారు. అనుపల్లిలో మాజీ ఎంపీపీ బిందు మాధవి, తుమ్మలగుంటలో బిరుదుల భాస్కర్‌ రెడ్డి, దొడ్ల కరుణాకర్‌ రెడ్డిల ఆధ్వర్యంలో పింఛన్లు అందజేశారు. నియోజకవర్గం టిడిపి అధ్యక్షుడు సిఆర్‌ రాజన్‌, నాయకులు సి.దివాకర్‌ రెడ్డి, బడి సుధాయాదవ్‌, పాల్గొన్నారు. యర్రావారిపాలెం మండలంలోని 12పంచాయతీలలో మొత్తం రూ.4,857లు మందికి గాను రూ.3,19,19,000లు నగదు పింఛనుదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. తిరుపతి(మంగళం): మంగళంలో పులివర్తి సుధారెడ్డి పింఛన్ల లబ్ధిదారులను శాలువాతో సన్మానించి పింఛన్లను అందించారు. మంగళం పరిధిలోని గ్రామపంచాయతీలలో సచివాలయ భవనాల వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాజీ ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీ అధ్యక్షులు కొల్లూరి ఈశ్వరయ్య, టిడిపి తిరుపతి రూరల్‌ ప్రధాన కార్యదర్శి గోపీనాథ్‌, రూరల్‌ మండల మహిళా అధ్యక్షురాలు రామంజేరి మహేశ్వరి పాల్గొన్నారు. తిరుపతి నగర పరిధిలోని ముత్యాలరెడ్డిపల్లి పంచాయతీ మాజీ సర్పంచి బోయనపాటి మమత ఆధ్వర్యంలో ఎల్‌ఎస్‌ నగర్‌లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. పుత్తూరు టౌన్‌ : నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ పుత్తూరు మున్సిపాలిటీ గేట్‌ వీధి నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు పింఛన్‌ నగదును అందజేశారు. పట్టణ అధ్యక్షులు గాలి జీవరత్నం నాయుడు, కార్యదర్శి ఎన్‌ఎన్‌ ధనపాల్‌, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ డిజి ధనపాల్‌ పాల్గొన్నారు. బుచ్చినాయుడు కండ్రిగ: మండలంలోని 28 పంచాయతీల్లో టిడిపి అధ్యక్షులు ఎం.సుధాకర్‌ నాయుడు అధ్యక్షతన ఎంపిడిఓ త్రివిక్రమరావు, సచివాలయ సిబ్బంది పింఛనుదారులకు పింఛన్‌ నగదును అందజేశారు. నాయుడుపేట: టిడిపి ఇంచార్జ్‌ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అర్హులకు పింఛన్లు అందజేశారు. అనంతరం సిఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నాయకులు శిరసనం బేటి.విజయభాస్కర్‌ రెడ్డి, 786 రఫీ, జనసేన పార్టీ ఇంచార్జ్‌ ఉయ్యాల ప్రవీణ్‌, పాల్గొన్నారు. పెళ్లకూరు: మండలంలోని కొత్తూరు, తాల్వాయిపాడు పంచాయతీలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్‌ నెలవల సుబ్రహ్మణ్యం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పింఛనుదారులకు పింఛన్లు అందజేశారు. మండల టిడిపి ప్రెసిడెంట్‌ సంచి కష్ణయ్య, కార్యదర్శి నాగేంద్రరెడ్డి, చైతన్య కష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు. నాగలాపురం: మండలంలోని సురుటుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లబ్ధిదారులకు పింఛన్‌ అందించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మురళి రాయలు, రుద్రయ్య, యమునమ్మ, మనోజ్‌ కుమార్‌, భాస్కర్‌ బాబు, హరినాథ్‌, వరుణ్‌ కుమార్‌, మోహన్‌ పాల్గొన్నారు.

➡️