తిరుపతి జిల్లా కలెక్టర్‌గా వెంకటేశ్వర్‌

తిరుపతి జిల్లా కలెక్టర్‌గా వెంకటేశ్వర్‌

తిరుపతి జిల్లా కలెక్టర్‌గా వెంకటేశ్వర్‌ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో రాష్ట్రంలో అధికార మార్పిడి తరువాత జరుగుతున్న బదిలీల్లో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్‌గా సలిజామల వెంకటేశ్వర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ జిల్లాలకు కొత్త కలెక్టర్లకు ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన సలిజమల వెంకటేశ్వర్‌ తిరుపతి జిల్లా కలెక్టర్‌గా రానున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ప్రవీణ్‌కుమార్‌ ఉద్యోగోన్నతిపై విజయవాడకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వెంకటేశ్వర్‌ను నియమించారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన సామాన్య రైతు వెంకయ్య కుమారుడు వెంకటేశ్వర్‌ యుపిఎస్‌సిలో 216 ర్యాంకు సాధించారు. నల్లపాడులో లయోలా కాలేజీలో విద్యనభ్యసించారు. విశాఖపట్నం శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. బైపిసి తీసుకున్న వెంకటేశ్వర్‌ ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి 2012లో ఎంబిబిఎస్‌ ఉత్తీర్ణత సాధించారు. సివిల్‌ సర్వీసు కోసం మూడుసార్లు ప్రయత్నించారు. ఆఖరిగా ఐఎఎస్‌ సాధించారు. తన విజయం వెనుక తన తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెంకటేశ్వర్‌ ప్రజలకు సేవ చేయాలన్న ధ్యేయంతోనే సివిల్స్‌ ర్యాంకు సాధించినట్లు మీడియాకు తెలిపారు. 2016లో ఐఎఎస్‌ బ్యాచ్‌కు చెందిన వెంకటేశ్వర్‌ మాతృ రాష్ట్రంలోనే పని చేయాలనుకున్నారు. విశాఖ జిల్లా పాడేరు సబ్‌ కలెక్టర్‌గా తొలుత బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత చిత్తూరు జిల్లా జేసీగా ఉన్నారు. రాష్ట్ర వైద్య విభాగంలో డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి జిల్లాకు కలెక్టర్‌గా రానున్నారు.

➡️