‘యాప్‌, వెబ్సైట్‌’ ద్వారా విద్యుత్‌ బిల్లుల చెల్లింపు

‘యాప్‌, వెబ్సైట్‌’ ద్వారా విద్యుత్‌ బిల్లుల చెల్లింపుప్రజాశక్తి – తిరుపతి సిటిఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎపిఎస్‌ పిడిసిఎల్‌) పరిధిలోని వినియోగదారులు విద్యుత్‌ బిల్లులను ఎపిఎస్‌ పిడిసిఎల్‌ మొబైల్‌ యాప్‌ (సదరన్‌ పవర్‌) లేదా వెబ్సైట్‌ ద్వారా చెల్లించాలని ఎపిఎస్పిడిసిఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె. సంతోష రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బిఐ) మార్గదర్శకాల మేరకు ఇకపై వినియోగదారులు ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎమ్‌ లతోపాటు ఇతర యూపిఐ యాప్స్‌ ద్వారా నేరుగా విద్యుత్‌ బిల్లులను చెల్లించే అవకాశం లేదన్నారు. ఎపిఎస్‌ పిడిసిఎల్‌ మొబైల్‌ యాప్‌ లేదా వెబ్సైట్‌ ద్వారా బిల్‌ డెస్క్‌ కు అనుసంధానమైన ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటిఎమ్‌ లతోపాటు ఇతర యూపిఐ యాప్స్‌ నుంచి బిల్లులను చెల్లించవచ్చని వివరించారు. వీటితోపాటు వినియోగదారులు నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు, వాలెట్‌, క్యాష్‌ కార్డుల ద్వారా కూడా విద్యుత్‌ బిల్లును చెల్లించవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

➡️