కట్టుదిట్టమైన భద్రత నడుమ పోల్డ్‌ ఈవిఎంలుకలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌

కట్టుదిట్టమైన భద్రత నడుమ పోల్డ్‌ ఈవిఎంలుకలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జిల్లాలోని 23- తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోల్‌ అయిన ఈవిఎంలను, సంబంధిత సామగ్రిని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల స్ట్రాంగ్‌ రూం నందు సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారులు భద్ర పరచడం జరిగిందని కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈవీఎంలను రాజకీయ పార్టీల, అభ్యర్థులు, అబ్జర్వర్‌ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూంలో భద్రపరచినట్లు తెలిపారు. శ్రీ పద్మావతి మహిళ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ నందు సాధారణ పరిశీలకులు ఉజ్వల్‌ కుమార్‌ ఘోష్‌, కైలాస్‌ వాంఖడే, కే.జ్యోతి, జిల్లా సాధారణ ఎన్నికల పోలీసు పరిశీలకులు అరవింద్‌ సాల్వే, రిటర్నింగ్‌ అధికారుల, రాజకీయ పార్టీల, అభ్యర్థుల సమక్షంలో వీడియో రికార్డింగ్‌ చేసి స్ట్రాంగ్‌ రూంలకు తాళాలు వేయడం జరిగిందనీ కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, పోలీస్‌ భద్రత సిబ్బంది తదితరులు ఉన్నారు.

➡️