అనుమతి లేకుండా బ్యానర్లు పెట్టరాదు 

Mar 18,2024 14:52 #Tirupati district

రిటర్నింగ్ ఆఫిసర్ అదితి సింగ్ ఐఏఎస్

ప్రజాశక్తి-తిరుపతి : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చించని, ఎవ్వరు కూడా తమ అనుమతి లేనిదే నగరంలో ఎక్కడ కూడా బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగులు పెట్టరాదని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ ఆఫిసర్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ సోమవారం ఓక ప్రకటనలో తెలియజేసారు. తిరుపతి నగరంలో ఇప్పటికే ఏర్పాటు చేసి వున్న అన్ని పోస్టర్లను, బ్యానర్లను తొలగించడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వాడ్లు నగరంలో పర్యటిస్తూ నియమ నిబంధనలు పటిష్టంగా అమలు పరిచేలా తగు చర్యలు తీసుకుంట్టున్నట్లు, ఎన్నికల నిబందనలకు వ్యతిరేకంగా ఎవరైన ప్రవర్తిస్తే చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటామని తిరుపతి రిటర్నింగ్ అధికారి, కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలిపారు.

➡️