ఉచిత వేసవి సంస్కృత శిక్షణ ప్రారంభం

ఉచిత వేసవి సంస్కృత శిక్షణ ప్రారంభం

ఉచిత వేసవి సంస్కృత శిక్షణ ప్రారంభం ప్రజాశక్తి – క్యాంపస్‌: జాతీయ సంస్కత విశ్వవిద్యాలయంలో సంస్కత భారతీ ఆంధ్రప్రదేశ్‌ సంయుక్త ఆధ్వర్యంలో చిన్నారులకు, పెద్దలకు, సామాజికులకు ఉచిత వేసవి సంస్కత శిక్షణ శిబిర ఉద్ఘాటన కార్యక్రమాన్ని బుధవారం చెలికాని అన్నారావు సభాభవనంలో ప్రారంభించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వపు సంస్కత భారతి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు డాక్టర్‌ దోర్బల ప్రభాకర శర్మ విచ్చేసి, ప్రతిఒక్కరూ కూడా సంస్కతాన్ని సరళంగాను, స్పష్టంగాను అధ్యయనం చేసి, సంస్కతంలో ఉన్న విలువలను తెలుసుకుని తద్వారా సామాజిక, నైతిక విలువలు కలిగి ముందుకు వెళ్లాలని అన్నారు. సంస్కతభాష ఔన్నత్యాన్ని అందరికీ చాటి చెప్పడానికి ప్రత్యేకించి, చిన్నప్పటినుంచే సంస్కతం బోధించాలనే లక్ష్యంతో ముందు వెళ్తున్నామని అందువల్ల అందరూ సంస్కతాన్ని నేర్చుకుని, సంస్కత జ్ఞానాన్ని పొందాలని సూచించారు. విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ఆర్‌ కష్ణమూర్తి మాట్లాడుతూ బాల్యదశ నుంచే సంస్కత భాష పైన అభిరుచిని కల్పిస్తూ, తద్వారా సంస్కతంలో చదవడం, రాయడం మొదలైనటువంటి విషయాలను ఆట, పాటలతో చక్కగా చిన్నారులకు నేర్పడం కొరకు బాలానంద కార్యక్రమం, సంస్కత సంభాషణ శిబిరం ఈ రెండూ వేసవికాలంలో ఉచితంగా విద్యార్థులకు విశ్వవిద్యాలయం తరఫున నేర్పించడం జరుగుతుందని వివరించారు. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రేణు దీక్షిత్‌ మాట్లాడుతూ సంస్కతం ఎంతో గొప్ప భాషని, అందులో అనేక గొప్పగొప్ప అంశాలు ఉన్నాయని వాటిని అధ్యయనం చేయాలని వివరించారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌జె.రమాశ్రీ సంస్కత సంభాషణ శిబిరం అవసరాన్ని వివరించారు. అనంతరం పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంటర్‌ ఫర్‌ సాంస్క్రిట్‌ లాంగ్వేజ్‌ ప్రమోషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ఎల్‌.సీతారాంశర్మ, సంస్కత భారతీ ప్రముఖులు డాక్టర్‌ ఎంజి.నందన రావు, డాక్టర్‌ కుమార్‌ బాగే వాడిమఠ్‌ పాల్గొన్నారు.

➡️