ఆకట్టుకున్న ఉగాది కవి సమ్మేళనం

ఆకట్టుకున్న ఉగాది కవి సమ్మేళనం

ఆకట్టుకున్న ఉగాది కవి సమ్మేళనంప్రజాశక్తి-శ్రీకాళహస్తి: క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ధూర్జటి రసజ్ఞ సమాఖ్య సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కైకాలవారి కళ్యాణ మండపంలో ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చేసిన కవులు వారి స్వీయ కవితలు వినిపించారు. ఉగాది ఉషస్సులు విరబూయాలని, సమసమాజ స్థాపనకు నడుంబిగించాలని కవితలు వినిపించారు. అనంతరం లగడపాటి భాస్కర్‌ సాహితీ పురస్కారాలను వారి కుమార్తెలు కిరణ్మయి, కృష్ణశశిలు శతావధాని ఆముదాల మురళికి, రచయిత చెంచుకష్ణ పిళ్ళైకి ఇద్దరికి ఐదువేల నగదుతో పాటు శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం కవితలు చదివిన కవులందరికి జ్ఞాపకలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గొడుగుచింత గోవిందయ్య, వేదిక ప్రధాన కార్యదర్శి యువశ్రీ మురళి కార్యవర్గ సభ్యులు జయచంద్ర రావు, తీగల వెంకటయ్య, గురునాధం, గణేష్‌ ,రవీంద్ర, బాలముని శివకుమార్‌, ముని సుబ్బారెడ్డి, డాక్టర్‌ నెమిలేటి కిట్టన్న, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

➡️