రాయలసీమలోనే అగ్రగామి ‘సీకాం’

May 23,2024 21:53
రాయలసీమలోనే అగ్రగామి 'సీకాం'

ప్రజాశక్తి-తిరుపతి సిటి కామర్స్‌్‌ విద్యాబోధనలో రాయలసీమలోనే అగ్రగామి సీకాం విద్యాసంస్థలని ఆ సంస్థ డైరెక్టర్లు ప్రణీత్‌ స్వరూప్‌, టి.తేజ స్వరూప్‌ తెలిపారు. స్థానిక ఎయిర్‌బైపాస్‌ రోడ్డులోని న్యూమారుతి నగర్‌లో ఉన్న సీకాం విద్యాసంస్థల ప్రాంగణంలో ‘ప్రజాశక్తి’తో వారు మాట్లాడుతూ సీకాం పేరు వాస్తవానికి సంక్షిప్త రూపం, ‘శ్రీనివాస ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కామర్స్‌. 44 సంవత్సరాల క్రితం ఇది ట్యుటోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌తో ప్రారంభమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, కలికిరిలో తన రెండు శాఖలతో ప్రబలంగా ఉందన్నారు. వివిధ రకాల అకడమిక్‌ ప్రొఫెషనల్‌ కోర్సులను అందిస్తోంది. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్‌, అండర్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలను పొందుతున్నారని తెలిపారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ టి. సురేంద్రనాథ రెడ్డి సుప్రసిద్ధ విద్యావేత్త, చురుకైన సామాజిక సేవకుడు, క్రీడలను ఎప్పుడూ ప్రోత్సహించేవారు, అనుసరించేవారు, ఎప్పుడూ అలసిపోని పరోపకారి. విద్యార్ధులు ఏ నేపథ్యం నుండి వచ్చిన సంబంధం లేకుండా విద్యను అందరికీ అందుబాటులో ఉండేలా చేయడంలో ఒక ప్రత్యేకమైన, అంకితభావంతో కూడిన అంతర్దష్టితో వ్యవహరించేవారని తెలిపారు. జూనియర్‌, డిగ్రీ, పిజి కోర్సులను అందరికి అందుబాటులో ఉంచామన్నారు. బికామ్‌ (కంప్యూటర్స్‌), బిసిఏ (డేటా సైన్స్‌), బిసిఏ (ఏ1), బిఎస్‌సి (ఆల్‌ గ్రూప్స్‌), బిబిఏ, ఎంకామ్‌ కోర్సుల్లో బోధన అందిస్తున్నామన్నారు. నాక్‌ అక్రిడేట్‌కల్గిన విద్యాసంస్థ సీకాం. ఇప్పటి వరకు తమ విద్యాసంస్థల్లో చదవిన సుమారు 30వేల మంది విద్యార్థులు వివిద రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. చదువుతో పాటు స్పోర్ట్స్‌ ఇతరత్రా రంగాల్లో సైతం నైపుణ్యం గడింప చేయడంలో తమదే పై చేయి అన్నారు. ప్రసిద్దిగాంచిన పరిశోధనశాలలో శిక్షణ పొందే అనుమతి కూడా లభించిందన్నారు. ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. వివరాలకు 7799045454, 9494060614 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలని కోరారు. ప్రత్యేకతలు….- సర్టిఫికెట్‌ కోర్సులు, బ్యాంకింగ్‌, పైనాన్స్‌ సౌకర్యాలు.- ఏడాదికి ఒకసారి పరిశ్రమల సందర్శన.- ఇంటర్‌షిప్‌ ఆపర్చునిటీ- స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌.-100 శాతం ఉపాధి అవకాశాలు.- ప్రతి తరగతికి కేవలం 40 మంది విద్యార్థులు మాత్రమే.- బ్యాంక్‌ ఎగ్జామ్స్‌, క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ.- బస్సు, హాస్టల్‌ సౌకర్యం. – 0శాతం లోన్‌ స్పెషాలిటీ.-బెంగుళూరుకు చెందిన జైన్‌ యూనివర్శిటీ సందర్శనకు అనుమతి. -కామర్స్‌ విద్యాబోధనలో విశేష అనుభవం. -అనుభవజ్ఞులైన అధ్యాపకులు.

➡️