ఘనంగా గణిత దినోత్సవం 

Dec 22,2023 17:01 #Tirupati district
maths day in

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : సూళ్లూరుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణిత దినోత్సవంను ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఎస్ వి ఎస్ ఎస్ సి ప్రభుత్వ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ ఎల్ బి.శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రపంచ గణిత శాస్త్ర చరిత్రలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనుడు శ్రీనివాస రామానుజన్ అని కీర్తించారు. ఈ సందర్భంగా రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మ్యాథమెటిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉషారాణి రామానుజన్ గొప్పతనాన్ని పిపిటి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బిఎస్సి తృతీయ సంవత్సర విద్యార్థులు భారతీయ గణిత శాస్త్రవేత్తలు ఆర్యభట్ట,బ్రహ్మగుప్తుడు మొదలగు వారి జీవిత చరిత్రలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ అంశం పై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలలో డాక్టర్ పి.విక్టోరియా రాణి,డాక్టర్ వి. రాజా, డాక్టర్ కె. వరప్రసాద్, ఆర్.శరత్ బాబు మరియు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

➡️