మెగా కార్మికుడు మృతి

May 23,2024 21:48
మెగా కార్మికుడు మృతి

శ్రీ విధి నిర్వహణలోనే గుండెపోటు శ్రీ న్యాయం చేయాలని కార్మికుల ఆందోళనశ్రీ రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకున్న సంస్థ శ్రీ ఆలస్యంగా వెలుగులోకొచ్చిన వైనంప్రజాశక్తి-శ్రీకాళహస్తి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మెగా కార్మికుడు విధుల్లో ఉండగానే గుండెపోటుతో మృ చెందిన సంఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆలస్యంగా వెలుగు చూసింది. మతుడికి న్యాయం చేయాలంటూ అదే రాష్ట్రానికి చెందిన మెగా కార్మికులు శ్రీకాళహస్తి పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న మెగా బేస్‌ క్యాంపు వద్ద గురువారం ఆందోళనకు దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుభాష్‌ చంద్ర మహాపత్రి(54) గత కొన్నేళ్లుగా హైడ్రా క్రేన్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నాయుడుపేట-మదనపల్లి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా శ్రీకాళహస్తి ప్రాంతంలో గత కొన్ని నెలలుగా అవిరామంగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం విధుల్లో ఉండగా ఛాతిలో తీవ్ర నొప్పి రావడంతో అక్కడికక్కడే కూలిపోయి తుది శ్వాస విడిచాడు. అయితే విధుల్లో ఉండగానే కార్మికుడు సుభాష్‌ చంద్ర మహాపత్రి గుండెపోటుతో మరణించాడన్న వార్త బయటకు పొక్కకుండా మెగా యాజమాన్యం చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కాగా తోటి కార్మికుడు గుండెపోటుతో మతి చెందడం తీవ్రంగా కలిచివేయడంతో ఒరిస్సా కార్మికులు గురువారం ఉదయం పెద్ద ఎత్తున మెగా బేస్‌ క్యాంపు చేరుకుని ఆందోళనకు దిగారు. నిరుపేద అయిన సుభాష్‌ చంద్ర కుటుంబానికి పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో గుండె పోటుతో మెగా కార్మికుడు మృతి చెందిన సంఘటన ఎట్టకేలకు బయటకు పొక్కింది.రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకున్న ‘మెగా’ మెగా సంస్థలో పనిచేసే రెగ్యులర్‌, ఒప్పంద కార్మికులకు ఆ సంస్థ ఆరోగ్య, జీవిత, ప్రమాద బీమా కల్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పనిచేసే సమయంలో కార్మికులు ప్రమాదాలబారిన పడకుండా, దుమ్ము, దూళి వల్ల దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడకుండా తగిన రక్షణ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే మెగా సంస్థ కార్మికుల ఆరోగ్య, జీవిత ప్రమాద రక్షణ పై తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కార్మికుల చేత అదనపు పని గంటలు చేయించుకుంటూ పీఎఫ్‌ వసతి కల్పించడం లేదని కార్మికులు చెప్తున్న పరిస్థితి. కార్మికులకు వ్యక్తిగత ఇన్సూరెన్సులు కాకుండా, గ్రూపు ఇన్సూరెన్సులు చేస్తూ ఆ ఇన్సూరెన్స్‌ ల మొత్తాన్ని కార్మికులకు తెలియకుండా దాస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదైనా కార్పొరేట్‌ సంస్థలో పనిచేస్తూ విధుల్లో ఉండగానే కార్మికుడు చనిపోతే తక్షణ పరిహారంగా ఆ సంస్థ ఆ కార్మికుడు కుటుంబానికి కనీసం రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అతను వలస కార్మికుడు. అయితే మతదేహాన్ని స్వస్థలానికి చేర్చడంతోపాటు అంత్యక్రియలకు సైతం నగదు సాయం ఆ సంస్థ చేయాల్సి ఉంటుంది. అయితే బుధవారం జరిగిన మెగా కార్మికుడి సంఘటనలో ఆ సంస్థ కార్మికుడి కుటుంబానికి కేవలం రూ.లక్ష మాత్రమే పరిహారంగా ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు సమాచారం.తక్షణ పరిహారం రూ.25 లక్షలివ్వాలి పెనగడం గురవయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి కేంద్రంలో మోడీ సర్కారు కొలువు దీరిన నాటి నుంచి కార్మిక చట్టాలు నిర్వీర్యమైపోగా, కార్పొరేట్‌ శక్తులు బలపడిపోయాయి. తద్వారా కార్మికులకు సరైన న్యాయం జరగడం లేదు. విధుల్లో ఉండగానే మెగా సంస్థలో పనిచేస్తున్న ఎంతోమంది కార్మికులు ప్రమాదవశాత్తు మరణించారు. ఆ విషయాలను ఆ సంస్థ బయటకు పొక్కనీకుండా దాచిపెడుతోంది. కార్మికుల చేత గొడ్డు చాకిరీ చేయించుకుంటూ కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు. గుండెపోటుతో మరణించిన ఒరిస్సా కార్మికుడు సుభాష్‌ చంద్ర కుటుంబానికి మెగా సంస్థ తక్షణ పరిహారంగా రూ.25 లక్షలివ్వాలి.

➡️