శ్రీవారి దర్శనం కోసం వచ్చిన బస్సు డ్రైవర్ హత్య

Jan 31,2024 17:20 #Tirupati district
murder in tirupati

ప్రజాశక్తి-తిరుపతి సిటి : శ్రీవారి దర్శనం కోసం వచ్చిన బస్సు డ్రైవర్ హత్య చేసిన ఘటన పాత తిరుచానూరు రోడ్డులోని ప్రైవేటు వాహనాలు నిలిచే స్టాండ్ లో ఘజరిగింది. 55 మంది శ్రీవారి భక్తులతో చత్తీస్ గడ్ కోర్బా నుండి తిరుపతికి వచ్చారు. మృతుడు అలహాబాద్ కు చెందిన చంద్రసేన్ తివారి(52)గా గుర్తించారు. క్లీనర్ నిరంజన్ డ్రైవర్ తలపై బలమైన రాడ్లతో హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఈస్ట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్య జరగడానికి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా… ఆర్థిక లావాదేవిలు ఏమైన ఉన్నాయన్న కోణంలో విచారిస్తున్నట్లు సిఐ మహేశ్వర్ రెడ్డి వెల్లడి.

➡️