4న జరిగే బంద్‌ను జయప్రదం చేయండి..ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యుఐ, పిడిఎస్‌ఓ విద్యార్థి సంఘాలు పిలుపు

4న జరిగే బంద్‌ను జయప్రదం చేయండి..ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యుఐ, పిడిఎస్‌ఓ విద్యార్థి సంఘాలు పిలుపు

4న జరిగే బంద్‌ను జయప్రదం చేయండి..ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యుఐ, పిడిఎస్‌ఓ విద్యార్థి సంఘాలు పిలుపుప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: నీట్‌ నెట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీను నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఈనెల 4వ తేదీన దేశంలో గల విద్యాసంస్థలన్నీ ఎల్‌కెజి నుంచి పీజీ వరకు బందుకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి రవి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ప్రవీణ్‌, ఎస్‌యుఐ నేత మల్లికార్జున వేమన విజ్ఞాన కేంద్రంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈసందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ దేశ గౌరవ ప్రతిష్టలకు విశిష్టమైన నీట్‌ పరీక్ష దేశ చరిత్రలో ఏనాడు కనివిని ఎరగని రీతిలో ఈ సంవత్సరం అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ నీట్‌ పరీక్ష నిర్వహించే ఎన్‌టిఏను రద్దు చేయాలని బాధిత విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు మొరపెట్టుకున్న ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్‌టిఏను పునరుద్ధరించవలసిన అవసరం ఉందని చెప్పారు కానీ బాధిత విద్యార్థులకు న్యాయం చేస్తామని గానీ నీటి పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని గానీ ప్రకటన ఇవ్వకపోవడం బాధ్యత రాహిత్యమని అన్నారు. ఈ సందర్భంగా నీట్‌ పరీక్ష పత్రాల లీకులకు కారణమైన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రద్దు చేయాలని, పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని, నూతన విద్యావిధానం పేరిట దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేత ఆపాలని వారు డిమాండ్‌ చేస్తూ ఈనెల 4వ తేదీ అల్లూరి స్ఫూర్తితో బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతుందని తెలియజేశారు. 4వ తేదీన లెఫ్ట్‌ విద్యార్థి సంఘాలను కలుపుకొని దేశవ్యాప్తంగా బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, విద్యార్థులు బందుకు సహకరించి బందును జయప్రదం చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు నవీన్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు హరికష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినోద్‌, తేజ, బాల, ఉమేష్‌, శివ, తదితరులు పాల్గొన్నారు.

➡️