శ్రీకాళహస్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ రాజేష్..?

Mar 20,2024 12:25 #Tirupati district

ప్రజాశక్తి-తిరుపతి: శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ దేవస్థానం చైర్మన్, టీడీపి సీనియర్ నేత పోతుగుంట గురవయ్య నాయుడు తనయుడు డాక్టర్ పోతుగుంట రాజేష్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షులురాలు వైఎస్ షర్మిళ సమక్షంలో చేరడంతో అటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చర్చ సాగుతోంది. శ్రీకాళహస్తి ఓటు బ్యాంక్ లో కొంత చీలిక వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా డాక్టర్ రాజేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఆయన సతీమణి చైతన్య కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే కాకుండా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు కావడంతో ఓటు బ్యాంక్ ను కూడా కొల్లగొట్టే అవకాశం ఉంది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఇండియా కూటమిలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండడంతో డాక్టర్ రాజేష్ కు కలిసి వచ్చే అంశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నం సుబ్రహ్మణ్యం నాయుడు, ఎస్సీవీ నాయుడులు ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తేలిసిందే. పైగా డాక్టర్ రాజేష్ సమీప బందువులు ఓ పార్టీలో కీలక నేతలుగా ఉండడం, కమ్మ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు ఒక్కరు అంటే ఒక్కరికి కూడా ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా పోవడంతో ఆ పార్టీ కమ్మ సామాజిక వర్గం కొంత అసహనంతో వున్నారు. అయితే ఓ పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఓ సీనియర్ నేత ఆశీస్సులు పోంది అసంతృప్తిలో వున్న కమ్మ నేతలు మద్దత్తు కూడగడితే డాక్టర్ రాజేష్ అనూహ్యంగా విజయం సాధించే అవకాశం లేకపోలేదు. అలాగే ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించినా రాక తీవ్ర నైరాశ్యంలో వున్న కాపు నేతలు కూడా సామాజిక ధర్మం ఆచరిస్తే కొంచెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాకర్ రాజేష్ ను విజయతీరాలకు చేర్చే అవకాలు మెండుగా వున్నాయి. ప్రజల్లో వున్న వ్యతిరేకత,కమ్యూనిస్ట్ నేతలు మద్దతుగా నిలిచి, అసంతృప్తి నేతలు ఆశీస్సులు పొందగలిగితే చాలు, డాక్టర్ రాజేష్ కాంగ్రెస్ జెండా ఎగుర వేయవచ్చు. మరి డాక్టర్ రాజేష్ వ్యూహం ఏమిటో తెలియాల్సి ఉంది.

➡️