సోమిరెడ్డికి మద్దతుగా మాజీ ఎంపి సుబ్రహ్మణ్యం

Dec 17,2023 15:23 #Tirupati district
tdp leader protest

ప్రజాశక్తి-నాయుడుపేట(తిరుపతి):- తెలుగుదేశం పోలీస్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టి నిర్వహిస్తున్న నిరసన సత్యాగ్రహానికి మాజీ ఎంపీ, సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం నాయుడుపేట టిడిపి నాయకులతో కలిసి వెళ్లి మద్దతు తెలియజేశారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం వరదపాలెం పంచాయతీలో జరుగుతున్న వేల కోట్ల అక్రమమైన దోపిడీకి నిరసనగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న సత్యాగ్రహం కార్యక్రమంలో ఆదివారం మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నాయుడుపేట టిడిపి నాయకులతో కలసి పాల్గొని తన మద్దతు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఆగడాలను, అక్రమ దోపిడీని ప్రజలకు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తారని అన్నారు.వారి వెంట నాయుడుపేట మాజీ జెడ్పిటిసి సభ్యులు పేరంశెట్టి.శ్రీరాం ప్రసాద్, తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు అవధానం. సుధీర్, నియోజకవర్గ టిడిపి నాయకులు ఉన్నారు.

➡️