మళ్లీ వస్తున్నారు..!ఆ ముగ్గురూ..! రేపు మోడీ, నేడు చంద్రబాబు, పవన్‌తిరుపతిలో రోడ్డుషో, పీలేరులో బహిరంగసభ

మళ్లీ వస్తున్నారు..!ఆ ముగ్గురూ..! రేపు మోడీ, నేడు చంద్రబాబు, పవన్‌తిరుపతిలో రోడ్డుషో, పీలేరులో బహిరంగసభ

మళ్లీ వస్తున్నారు..!ఆ ముగ్గురూ..! రేపు మోడీ, నేడు చంద్రబాబు, పవన్‌తిరుపతిలో రోడ్డుషో, పీలేరులో బహిరంగసభప్రజాశక్తి – తిరుపతి బ్యూరో శ్రీవారి పాదాల సాక్షిగా సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీలకు ఓటేయాలని ఆ ముగ్గురూ తిరుపతికి విచ్చేశారు. తారకరామ స్టేడియంలో లక్షలాది మంది పార్టీ శ్రేణుల మధ్య నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తి, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు కడపకు ఉక్కు ఫ్యాక్టరీ, ఐదు లక్షల కోట్లను ప్రాంతాల అభివృద్ధికి సాయం చేస్తామని ఃశ్రీవారిః సాక్షిగా చెప్పారు. ముగ్గురూ ఒకే వేదికపై ప్రమాణం చేశారు. తీరా పదేళ్లయ్యింది. అధికారంలోకి మోడీ రెండుసార్లు వచ్చారు. చంద్రబాబు ఒకసారి నవ్యాంధ్రకు అధికారంలో ఉన్నారు. ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. మళ్లీ ఓట్ల కోసం ప్రజల ముందుకు అబద్దాలు చెప్పేందుకు బుధవారం ప్రధాని నరేంద్రమోడీ, మంగళవారం టిడిపి, జనసేన అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌లు ప్రజల ముందుకు రానున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగే రోడ్డుషోకు ప్రధాని మోడీ తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బుధవారం రానున్నారు. అక్కడనుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పీలేరుకు వెళ్లి బహిరంగసభలో పాల్గొంటారు. ఒకరోజు ముందే మోడీకి స్వాగతం పలికేందుకు తిరుపతిలో రోడ్డు షో నిర్వహించి ఇక్కడే బస చేయనున్నారు నారా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు లీలమహల్‌ సర్కిల్‌ నుంచి దేవేంద్రథియేటర్‌, పాత మున్సిపల్‌ కార్యాలయం మీదుగా నాలుగు కాళ్ల మండపం వరకూ రోడ్డుషో ఉంటుంది. బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. పేరుకు మాత్రమే రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ ప్రమాణాలతో తిరుపతి ఎయిర్‌పోర్టు నడవడం లేదు. తాము అధికారంలోకి వస్తే గల్ఫ్‌ దేశాలకూ ఇక్కడినుంచే నేరుగా వెళ్లొచ్చని ఢాంబికాలు పలికారు. మన్నవరంను మరింత అభివృద్ధి చేసి ఉత్పత్తి పెంచుతామని మాటిచ్చారు. అది గుజరాత్‌కు తరలిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం సామాజిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని జిఎస్‌టి మినహాయింపు ఇవ్వాలని జిఎస్‌టి ప్రవేశపెట్టినప్పటి నుంచి ఉన్నతాధికారులు కోరారు. కేంద్రం సైతం న్యాయసమ్మతమేనని ఒప్పుకుంది. గత పదేళ్లుగా వేల కోట్ల రూపాయలను జిఎస్‌టి రూపంలో టిటిడి కడుతూనే ఉంది. రాయలసీమ అభివృద్ధికి ఏడాదికి 50 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చి తుంగలో తొక్కింది. కడప ఉక్కు ఊసే లేదు. చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌పురంలో 750 ఎకరాలను ప్రభుత్వ ల్యాండ్‌ తీసుకుని ప్రహరీ గోడకు 15 కోట్లు ఖర్చు చేసి నిర్మించింది. మిలట్రీ ఆయుధాల తయారీ కేంద్రం ప్రహరీ గోడకే పరిమితమయ్యింది. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతూ నంబర్‌ వన్‌ సిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికీ కేంద్రం నుంచి ఇచ్చిన నిధులు నామమాత్రమే. ట్రాఫిక్‌ రద్దీ దృష్టిలో ఉంచుకుని టిటిడి, తిరుపతి కార్పొరేషన్‌ భాగస్వామ్యంతో శ్రీనివాస సేథు నిర్మాణం జరుగుతుంటే బిజెపి అడ్డు పుల్ల వేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శ్రీవారి నిధులు ఇవ్వొచ్చని కోర్టు మొట్టికాయ వేయడంతో సర్దుకుంది. అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకోవడం, కేంద్రం ఇచ్చిన హామీలను విస్మరించడమే బిజెపి పదేళ్లపాటు చేసిన ఘనత. మళ్లీ మరొక్కసారి తన అబద్దాల చిట్ట విప్పేందుకు నరేంద్రమోడీ పీలేరుకు రానున్నారు. ఆయన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సాగిల పడనున్నారు.

➡️