స్పెషల్‌ పోలీస్‌ అబ్జర్వర్‌కుఘన స్వాగతం

స్పెషల్‌ పోలీస్‌ అబ్జర్వర్‌కుఘన స్వాగతం

స్పెషల్‌ పోలీస్‌ అబ్జర్వర్‌కుఘన స్వాగతంప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రిటైర్డ్‌ డిజిపి దీపక్‌ మిశ్రాని రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ అబ్సర్వర్‌గా నియమించారు. ఈ నేపధ్యంలో చిత్తూరుకు విచ్చేసిన స్పెషల్‌ పోలీస్‌ అబ్సర్వర్‌ని చిత్తూరు పట్టణములోని ప్రభా గ్రాండ్‌ హోటల్‌ వద్ద జిల్లా ఎస్పీ మర్యాద పూర్వకంగా పూలగుచ్చంతో కలిశారు. అనంతరం చిత్తూరు పోలీస్‌ గెస్ట్‌ హౌస్‌లో గల కాన్ఫరెన్స్‌ హాల్‌ నందు జిల్లా ఎన్నికల అబ్సర్వర్‌లు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో పోలీస్‌ సబ్‌ డివిజన్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దీపక్‌ మిశ్రా, మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి అలసత్వం వహించకుండా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని క్షేత్రస్థాయిలో ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టులు వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. అక్రమ రవాణాను అరికట్టుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటరీ పరిధిలో అన్ని పోలింగ్‌ బూత్‌ వివరాలను తెలిపారు. పోలింగ్‌ రోజున ఓటర్లకు కల్పించనున్న సౌకర్యాలను వివరిస్తూ వారిని అవగాహన పరచడానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్‌ శాతం పెరిగేలా చర్యలు చేపట్టామని ఇందులో భాగంగా సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కూడా నిర్వహించామని తెలిపారు. ఓటర్లు అక్రమ మద్యం లేదా నగదు పంపిణికి సంబందించిన ఫిర్యాదులకు ప్రత్యేక అధికారులను నియమించి వారి ఫోన్‌ నెంబర్లను ప్రజలకు తెలిపామని తెలియజేశారు. జిల్లా ఎస్పీ వి.ఎన్‌. మణికంఠ చందోలు మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి పనిచేస్తున్నామని క్షేత్రస్థాయిలో ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టులు వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని అక్రమ రవాణాను అరికట్టుటకు ప్రత్యేక చర్యలు, నైట్‌బీట్‌ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. ఎన్నికల ట్రబుల్‌ మాంగర్స్‌, రౌడీ షీటర్లను బైండోవర్‌ చేస్తూ వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని, సాయుధ దళాలతో రూట్‌ మార్చ్‌ నిర్వహించి, ప్రజలు వారి ఓటు హక్కు ను స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకునేలాగా భరోసాను కల్పిస్తున్నామన్నారు. అలాగే సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు పోలీసు సిబ్బంది, కేంద్ర బలాగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల గురించి వివరించారు. గత ఎన్నికల సమయంలో నిర్వర్తించిన విధి విధానాలను పరిగణలోనికి తీసుకోని మరింత పకడ్బందిగా, పారదర్శకంగా ఓటింగ్‌ జరిగేలా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈసమావేశంలో జనరల్‌ అబ్జర్వర్‌ లు శాదిక్‌ ఆలం, కైలాష్‌ వాంఖడే, చిత్తూరు పార్లమెంట్‌ వ్యయ పరిశీలకులు శంకర్‌ ప్రసాద్‌ శర్మ, శ్రీనివాస్‌ కన్న, రోహన్‌ ఠాకూర్‌, జిల్లాలోని సబ్‌ డివిజన్‌ డీఎస్పీలు, ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్‌ విశ్వనాథ రెడ్డి, రెండవ పట్టణ ఇన్స్పెక్టర్‌ ఉలసయ్య, ఆర్‌ఐ భాస్కర్‌ పాల్గొన్నారు.

➡️