శిక్షణలు మేథోవికాసానికి దోహదం

May 23,2024 17:48 #vikasam

ప్రజాశక్తి-గన్నవరం
విద్యార్థినీ విద్యార్థులు గ్రంథాలయాల్లో జరిగే తరగతులకు హాజరవ్వటం ద్వారా వారిలో మేథోవికాసం మరింతగా పెరుగుతుందని కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ అనుబంధమైన ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలోని బ్రాంచి గ్రంథాలయం అధికారి ఎల్‌.హరికృష్ణ అన్నారు. పిల్లలకు వేసవి సెలవుల సందర్భంగా ప్రత్యేకంగా వేసవి విజ్ఞాన తరగతులు గత ఎనిమిదిరోజులుగా ఉత్సాహ పూరితవాతావరణంలో కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ విద్యార్థులతో కథలు చదివిస్తున్నారు. చక్కని చేతిరాతపై పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. చదరంగం , క్యారమ్స్‌ , లూడో వంటి ఆటలు పోటీలు సైతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గన్నారు.

➡️