పాలకొల్లు మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీ…

Feb 27,2024 13:11

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు మున్సిపల్‌ కమిషనర్‌ శేషాద్రి బదిలీ అయ్యారు. చీరాల మున్సిపల్‌ కమిషనర్‌ గా పనిచేస్తున్న విజయ సారధి ఇక్కడకు రానున్నారు. ఇప్పటివరకు పనిచేసిన శేషాద్రి రేపల్లి కమిషనర్‌ గా బదిలీ అయ్యారు. ఆయన 3 రోజుల క్రితం 15 రోజులు పాటు సెలవు పెట్టారు. ఈ నేపథ్యంలో డిఎంఏ కార్యాలయం నుంచి బదిలీ ఉత్తర్వులు వెలుపడ్డాయి. రాజకీయ పరిణామాలు నేపథ్యంలోనే బదిలీలు జరిగినట్లు పురపాలక సంఘ ఉద్యోగుల్లో బహిరంగంగా వినిపిస్తోంది.

➡️