అంగన్వాడీల సమ్మెకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ సంఘీభావం

Dec 26,2023 14:24 #Anganwadi strike, #East Godavari

ప్రజాశక్తి-ఉండి(తూర్పుగోదావరి) : తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీలు ఉండి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేస్తున్న సమ్మెకు మంగళవారం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపి మూర్తి, జిల్లా అధ్యక్షులు విజయరామరాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలపడానికి వస్తున్న ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి అందరికీ తెలిసిందేనని ఆయన స్ఫూర్తితో అంగన్వాడీలకు మద్దతుగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చలు జరపాలని లేని పక్షంలో అంగన్వాడీలకు మద్దతుగా ప్రత్యక్ష ఆందోళనకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ పిలుపునిస్తుందని హెచ్చరించారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాదు అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి హితవు పలికారు. అనంతరం అంగన్వాడీలు మాట్లాడుతూ తాము కంచాలు గరిటలతో చేసే శబ్దం చెవులు మూసుకుపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి వినపడాలని అప్పుడైనా మాకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు.

➡️