పట్టణ సమస్యలు పరిష్కరిస్తా

Apr 26,2024 21:26

ప్రజాశక్తి – సాలూరు : మరోసారి అవకాశం ఇస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తానని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని ఆరో వార్డులో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. గడచిన ఐదేళ్లలో పట్టణ వాసులకు ఎంతగానో ఉపయోగపడే బైపాస్‌ రోడ్డు నిర్మించామని చెప్పారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. కావున ఫ్యాన్‌ గుర్తు పై ఓటు వేసి తనకు మరోసారి గెలిపించాలని రాజన్నదొర కోరారు. ఈ ప్రచారంలో అరకు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్‌ డి.తనూజారాణి కూడా పాల్గొన్నారు. రాజన్నదొర, తనూజారాణి సమక్షంలో టిడిపి నాయకులు షేక్‌ అబ్దుల్‌ వైసిపిలో చేరారు. వార్డు ప్రచారం లో భాగంగా ఈశ్వరీయ బ్రహ్మ కుమారి విద్యాలయానికి వెళ్లి ధ్యానం చేశారు. కార్యక్రమంలో అర్బన్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జర్జాపు ఈశ్వరరావు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ పిరిడి రామకృష్ణ, కౌన్సిలర్‌ జర్జాపు నీలిమ పాల్గొన్నారు.కొత్తవలసలో వైసిపి ఇంటింటి ప్రచారంమండలంలోని కొత్తవలస పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌ పర్సన్‌ రెడ్డి పద్మావతి శుక్రవారం ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యేగా రాజన్నదొరకు అవగాహన వుందని, ఆయన్ను గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నెమలిపిట్ట ధర్మావతి, సీనియర్‌ నాయకులు బొన్నాడ సీతారాం, జయసింహ, అధికారి నాయుడు పాల్గొన్నారు.భామిని : మండలంలోని నులకజోడు, సింగిడిలో ఎమ్మెల్యే వి.కళావతి ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. శత శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలను పారదర్శకంగా అమలు చేసిన వైసిసిని మళ్లీ గెలిపించాలని కోరారు. అనంతరం ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, గ్రామాల్లో పాఠశాలలు, వైద్య కేంద్రాలు, సచివాలయం వ్యవస్థ సేవలు గురించి వివరించారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ తోట సింహాచలం, నులకజోడు సర్పంచ్‌ కొత్తూరు ప్రసాదరావు, ఎంపిటిసి బూస బాలకృష్ణ, వైసిపి కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️