నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా

Apr 1,2024 21:27

గంట్యాడ/జామి : రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను వైసిపి పూర్తిగా నాశనం చేసిందని గజపతినగరం నియోజకకవర్గం టిడిపి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. సోమవారం జామి, గంట్యాడ మండల కేంద్రాల్లో జరిగిన పార్టీ క్లస్టర్‌ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. టిడిపి హయాంలో భీమసింగి సుగర్స్‌ను అభివృద్ధి చేస్తే వైసిపి దాన్ని పూర్తిగా నాశనం చేసిందన్నారు. చంద్రబాబు సిఎం అయితే ఫ్యాక్టరీని తెరిపిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ఉపాధి లేక యువత వలస పోతున్నారని, వీటిని అరికట్టేందుకు చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తానని తెలిపారు. మాజీ ఎంపిపి కొండలరావు మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగానే శ్రీనివాస్‌కు టిక్కెట్‌ కేటాయించారని అందరూ సహకరించి గెలిపించాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు పి.స్వామినాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. గంట్యాడలో మాజీ ఎంపిపి కొండపల్లి కొండలరావు, రంధి రామునాయుడు, వర్రి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

➡️