జాబ్‌మేళాలో 42 మంది ఎంపిక

Feb 3,2024 18:46

ప్రజాశక్తి-విజయనగరం : స్థానిక బిసి కాలనీ ప్రభుత్వ ఐటిఐలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన జాబ్‌ మేళాకు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. 83 మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ మేళాకు హాజరయ్యారు. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌లో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌-6, ఫైనాన్షియల్‌ కల్సల్టెంట్‌-50, ఇంటెల్‌ సర్వ్‌లో ఫీల్డ్‌ కలెక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌, ఆఫీసు వర్క్‌- 25 ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్‌మేళాను నిర్వహించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం వీరిలో 42 మందిని తదుపరి పరీక్షలకు ఎంపిక చేశారు. ఈ మేళాను జిల్లా ఉపాధి అధికారి డి.అరుణ, ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్‌ టివి గిరి, ఆయా కంపెనీల హెచ్‌ఆర్‌లు సాగర్‌, రామ్‌కుమార్‌, ఎం.యశ్వంత్‌ బాబు, జిల్లా ఉపాధి కార్యాలయ సిబ్బంది పర్యవేక్షించారు.

➡️