జిడిఎస్‌ ఉద్యోగుల సమ్మె

Dec 14,2023 22:12

విజయనగరం టౌన్‌ : 8 గంటలు పని దినాన్ని అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని తపాలా శాఖలో ఉన్న జిడిఎస్‌ ఉద్యోగులు గురువారం నుంచి సమ్మెబాట పట్టారు. సమ్మె సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి జిడిఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ.నాగేశ్వరరావు, పెంట పాపయ్య మాట్లాడుతూ 8 గంటల పనిదినాన్ని అమలుచేసి, తపాలా శాఖ ఉద్యోగులతో సమానంగా పింఛను, మిగతా ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కమలేష్‌ చంద్ర కమిటీ నివేదిక అమలు చెయ్యాలన్నారు. అశాస్త్రీయ లక్ష్యాలు, అధికారుల వేధింపులు ఆపాలన్నారు. కార్యక్రమంలో కోశాధికారి జి.గోవిందరావు, జిడిఎస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️