న్యాయవాదుల నిరసన

Jan 23,2024 18:03

ప్రజాశక్తి-కొత్తవలస : స్థానిక కోర్టు వద్ద మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు అమలుకు వ్యతిరేకంగా బుధవారం నుంచి ఫిబ్రవరి ఏడో తేది వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎన్‌విఎస్‌ గిరిబాబు తెలిపారు. అందులో భాగంగా 25న న్యాయవాదులు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ చేపట్టి, తహశీల్దార్‌కు వినతి అందించనున్నట్లు చెప్పారు.

➡️